లోతుల్లో దాగిన రహస్యాలు
ఇవ్వాళ కొత్త రంగులను పూసుకున్నాయి.
పెదవి దాటని మాటలు మౌనంగా
కంటికి తాకని బింబాలు
స్తబ్దతగా ఏవేవో కథలను చిత్రిస్తున్నాయి.
నిన్నటి సాయంత్రం ఒంటికాలి కాకి
స్మశానంలో దొరికే పిండం కోసం
ఏ దేవుడినైనా మొక్కుతుందా
బతుకంటే బరువు కాదని గూటి నుండి బయలుదేరే
తల్లిపిట్ట హితవు చెబుతూ
రేపటికి ఏ గింజను దాచలేదు మరి.
సాగిపోవడమే,
ఆగిపోవడంలో ఏ నిర్వచనం లేదు.
- రామ్ పెరుమాండ్ల, 9542265831
The post హ్మ్… appeared first on Navatelangana.
లోతుల్లో దాగిన రహస్యాలుఇవ్వాళ కొత్త రంగులను పూసుకున్నాయి.పెదవి దాటని మాటలు మౌనంగాకంటికి తాకని బింబాలుస్తబ్దతగా ఏవేవో కథలను చిత్రిస్తున్నాయి.నిన్నటి సాయంత్రం ఒంటికాలి కాకిస్మశానంలో దొరికే పిండం కోసంఏ దేవుడినైనా మొక్కుతుందాబతుకంటే బరువు కాదని గూటి నుండి బయలుదేరేతల్లిపిట్ట హితవు చెబుతూరేపటికి ఏ గింజను దాచలేదు మరి.సాగిపోవడమే,ఆగిపోవడంలో ఏ నిర్వచనం లేదు.
The post హ్మ్… appeared first on Navatelangana.
