Headlines

బిసి రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల ను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను స వాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం బర్ 9 ను జారీ చేసిందని, ఈ జీవోను రద్దు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎస్సీ, ఎస్టీ, బిసిల రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దమని కోర్టుకు తెలిపా రు. ఈ జీఓలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం,

బిసిలకు 42 శాతం కల్పించారని, దీంతో రిజర్వేషన్ల కోటా 67 శాతానికి చేరిందని, ఇది చట్టవిరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ జీఓ నెంబర్ తొమ్మిదిని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిద్దార్థ దవే, అభిషేక్ సింఘ్వీ, ఏడిఎన్ రావులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారించలేమన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది.

హైకోర్టులో పిటిషన్లపై రేపు విచారణ

బిసి రిజర్వేషన్ల పెంపు జీఓపై హైకోర్టులో దాఖలయిన పిటిషన్ల విచారణ బుధవారం జరగనుంది. ప్రాథమిక విచారణ అనంతరం హైకోర్టు ధర్మాసనం ప్రతి వాదులకు నోటీసులు ఇస్తూ ఈ నెల 8వ తేదీకి విచారణను వాయిదా వేసింది. బిసి రిజర్వేషన్ల పెంపు జీఓ సవాల్ చేస్తూ మాదవ్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా, ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

​మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల ను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను స వాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం బర్ 9 ను జారీ చేసిందని, ఈ జీవోను రద్దు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎస్సీ, ఎస్టీ, బిసిల రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దమని కోర్టుకు తెలిపా రు. ఈ జీఓలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బిసిలకు 42 శాతం కల్పించారని, దీంతో రిజర్వేషన్ల కోటా 67 శాతానికి చేరిందని, ఇది చట్టవిరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ జీఓ నెంబర్ తొమ్మిదిని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిద్దార్థ దవే, అభిషేక్ సింఘ్వీ, ఏడిఎన్ రావులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారించలేమన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది.
హైకోర్టులో పిటిషన్లపై రేపు విచారణ
బిసి రిజర్వేషన్ల పెంపు జీఓపై హైకోర్టులో దాఖలయిన పిటిషన్ల విచారణ బుధవారం జరగనుంది. ప్రాథమిక విచారణ అనంతరం హైకోర్టు ధర్మాసనం ప్రతి వాదులకు నోటీసులు ఇస్తూ ఈ నెల 8వ తేదీకి విచారణను వాయిదా వేసింది. బిసి రిజర్వేషన్ల పెంపు జీఓ సవాల్ చేస్తూ మాదవ్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా, ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *