
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గా నవీన్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆశావాహుల్ పోటీ పడిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఆశావాహులను వడపోసి నలుగురి పేర్లతో సిఫార్సు చేసింది. ఈ నలుగురి పేర్లను పార్టీ అధిష్టానం దృష్టికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తీసుకెళ్ళారు. నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రాంమోహన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. కాగా బొంతు రాంమోహన్ మంగళవారం అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. తాను ఎవరినీ సీటు కావాలని అడగలేదని, తాను బరిలో లేనని చెప్పారు.
అయితే కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసౌ ఇచ్చినందుకే బొంతు బరి నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక మిగిలింది నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి. కాగా బిసికే టిక్కెట్ ఇస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక నాయకునికే టిక్కెట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా కాలంగా చెబుతున్నారు. దీంతో బిసికే టిక్కెట్ అన్నప్పుడు సిఎన్ రెడ్డికి టిక్కెట్ దక్కదని, స్థానికునికే టిక్కెట్ అంటే అంజన్కూ ఛాన్స్ లేదని స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్‌కే టిక్కెట్ అని పార్టీ నాయకులు, కార్యకర్తల అంఛనా వేస్తున్నారు. నవీన్ యాదవ్‌పై ఎన్నికల కేసు ఉన్నా, అది పెద్దగా నష్టం కలిగించదని, ఇటువంటి కేసులు ఉండడం సహజమేనని పార్టీ నేతలు అంటున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గా నవీన్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆశావాహుల్ పోటీ పడిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఆశావాహులను వడపోసి నలుగురి పేర్లతో సిఫార్సు చేసింది. ఈ నలుగురి పేర్లను పార్టీ అధిష్టానం దృష్టికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తీసుకెళ్ళారు. నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రాంమోహన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. కాగా బొంతు రాంమోహన్ మంగళవారం అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. తాను ఎవరినీ సీటు కావాలని అడగలేదని, తాను బరిలో లేనని చెప్పారు. అయితే కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసౌ ఇచ్చినందుకే బొంతు బరి నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక మిగిలింది నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి. కాగా బిసికే టిక్కెట్ ఇస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక నాయకునికే టిక్కెట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా కాలంగా చెబుతున్నారు. దీంతో బిసికే టిక్కెట్ అన్నప్పుడు సిఎన్ రెడ్డికి టిక్కెట్ దక్కదని, స్థానికునికే టిక్కెట్ అంటే అంజన్కూ ఛాన్స్ లేదని స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్‌కే టిక్కెట్ అని పార్టీ నాయకులు, కార్యకర్తల అంఛనా వేస్తున్నారు. నవీన్ యాదవ్‌పై ఎన్నికల కేసు ఉన్నా, అది పెద్దగా నష్టం కలిగించదని, ఇటువంటి కేసులు ఉండడం సహజమేనని పార్టీ నేతలు అంటున్నారు.
