ప్రగళ్లపాటి కనకరాజుకు విద్యావిభాగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జీవిత సాఫల్య పురస్కారం
విశాలాంధ్ర – గోకవరం : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో నిర్వహించబడిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఫంక్షన్లో ప్రముఖ విద్య, సేవా మూర్తి ప్రగళ్లపాటి కనకరాజు విద్యావిభాగంలో జీవిత సాఫల్య పురస్కారం అవార్డులో అందుకున్నారు. ఈ ఘన సమారోహం సమాజ సేవ, విద్యా సేవ స్ఫూర్తిగా, వాసవి ధర్మా తత్వాల సమ్మేళంగా నిలిచింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమావేశం మంగళ వారం పుదుచ్చేరిలో అధ్యక్షులు వి ఎస్ డైమండ్ కేజీఎఫ్ ఇరుకుల్లా రామకృష్ణ అధ్యక్షతన జరిగిందని ఆదర్శ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రెటరీ నాగమణి తెలియజేశారు. కనకరాజుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జీవిత సాఫల్య పురస్కారను పుదుచ్చేరి పబ్లిక్ వర్క్ శాఖామంత్రి ధీరుకే లక్ష్మీనారాయనన్ చేతుల మీదుగా అవార్డును తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగళ్లపాటి కనకరాజు మాట్లాడుతూ ఈ గౌరవం దక్కటం నా వ్యక్తిగత విజయం కాదని ముఖ్యంగా మా భార్య డాక్టర్ నాగమణి యొక్క ప్రోత్సహం ఎంత ఉందని, మా పిల్లలు అల్లుళ్ళు సహకారంతో మా యొక్క అధ్యాపక బృందం విద్యార్థులు విద్యార్థులకు ఉత్తమ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించారని ఈ సందర్భంగా తెలియజేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జీవిత సాఫల్య పురస్కారం ను అందుకున్న ఆదర్శ విద్యాసంస్థల అధినేత కనకరాజుకు ఆదర్శ డైరెక్టర్స్ హారిక సంతోష్, ప్రవల్లిక సంతోష్, కోఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ త్రినాధరావు, వైస్ ప్రిన్సిపాల్ సుజిని, ఆదర్శ హై స్కూల్ హెడ్మాస్టర్ సత్యనారాయణ, అధ్యాపక బృందం కామేష్, ప్రేమ్, డాక్టర్ పైడిరాజు, సంకీర్తన, డాక్టర్ గణేష్ కొత్తపల్లి ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షులు వీరస్వామి, సోదరులు రామమూర్తి సుబ్బారావు రామకృష్ణ తదితరులు అభినందించారు
The post ప్రగళ్లపాటి కనకరాజుకు జీవిత సాఫల్య పురస్కారం appeared first on Visalaandhra.
ప్రగళ్లపాటి కనకరాజుకు విద్యావిభాగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జీవిత సాఫల్య పురస్కారం విశాలాంధ్ర – గోకవరం : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో నిర్వహించబడిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఫంక్షన్లో ప్రముఖ విద్య, సేవా మూర్తి ప్రగళ్లపాటి కనకరాజు విద్యావిభాగంలో జీవిత సాఫల్య పురస్కారం అవార్డులో అందుకున్నారు. ఈ ఘన సమారోహం సమాజ సేవ, విద్యా సేవ స్ఫూర్తిగా, వాసవి ధర్మా తత్వాల సమ్మేళంగా నిలిచింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమావేశం మంగళ వారం
The post ప్రగళ్లపాటి కనకరాజుకు జీవిత సాఫల్య పురస్కారం appeared first on Visalaandhra.
