పంటల నష్టం వివరాలను తెలియజేయండి.
మండలంలోని చిట్యాల గ్రామంలో ఒరిగిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు.
విశాలాంధ్ర – గోపాలపురం : తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన మరియు గృహాలు పూర్తి గాను పాక్షికంగాను దెబ్బతిన్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. బుధవారం మండలంలోని చిట్యాల, వెంకటాయపాలెం గ్రామాలలో ఈదురు గాలులకు ఒరిగిపోయిన వరి పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అగ్రికల్చరల్ ఏవో తో మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలలో తుఫాను కారణంగా పంటలు నష్టం వాటిల్లిన పొలాలను సర్వే చేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తుఫాను కారణంగా మండల పరిధిలో రెండు ఇల్లు పూర్తిగాను ఐదు ఇండ్లు పాక్షికంగానూ దెబ్బతిన్నట్లు తెలిపారు. పడిపోయిన పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబ యజమానులకు ప్రభుత్వ సహాయం అందిస్తామని ఆయన అన్నారు. అధికారులు ప్రజలు మాందా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనడంలో ఎంతో శ్రమ పడ్డారని తెలిపారు. అదేవిధంగా స్థానిక గోపాలపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన పునరవాస కేంద్రంలో ఉన్న సుమారు 25 కుటుంబాల వారిని కలసి వారి యొక్క క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు వారికి అందుతున్నటువంటి భోజన సదుపాయాలు వైద్య సేవలను గూర్చి ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఎవరు భయపడవలసిన పనిలేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చెరుకుమిల్లి సొసైటీ అధ్యక్షులు గద్దె హరిబాబు, నూతంగి దొరబాబు, జేష్ట శ్రీనివాసరావు,బురెడ్డి వాసు, ఎంపీడీవో గెల్లా రాజ మనోహర్ తహసిల్దార్ ఎం వి సాయి ప్రసాద్ కూటమి నాయకులు పలువురు అధికారులు పాల్గొన్నారు.
The post పంట పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి appeared first on Visalaandhra.
పంటల నష్టం వివరాలను తెలియజేయండి. మండలంలోని చిట్యాల గ్రామంలో ఒరిగిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. విశాలాంధ్ర – గోపాలపురం : తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన మరియు గృహాలు పూర్తి గాను పాక్షికంగాను దెబ్బతిన్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. బుధవారం మండలంలోని చిట్యాల, వెంకటాయపాలెం గ్రామాలలో ఈదురు గాలులకు ఒరిగిపోయిన వరి పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అగ్రికల్చరల్ ఏవో తో మాట్లాడుతూ మండలంలోని
The post పంట పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి appeared first on Visalaandhra.
