Headlines

చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్!

Malavika Mohanan Comments On Chiranjeevi

Malavika Mohanan Comments On Chiranjeevi: 70 ఏళ్ళ వయస్సు లో కూడా ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా మెగా స్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత 6 సినిమాలను విడుదల చేసాడు మెగాస్టార్. ‘భోళా శంకర్’ తర్వాత ‘విశ్వంభర’ చిత్రాన్ని మొదలు పెట్టి పూర్తి చేసాడు. సినిమా మొత్తం గ్రాఫిక్స్ మీద ఆధారపడుంది కాబట్టి, అద్భుతమైన క్వాలిటీ కోసం వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈలోపు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి తో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమాని మొదలు పెట్టి, దాదాపుగా పూర్తి చేసే దశకు తీసుకొచ్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవనే చెప్పాలి. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి KVN ప్రొడక్షన్స్ లో ఒక సినిమాని చేయబోతున్నాడు.

తనతో గతంలో వాల్తేరు వీరయ్య లాంటి సంచలనాత్మక బ్లాక్ బస్టర్ ని అందించిన బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ నేపథ్యం లో ఈ చిత్రం తెరకెక్కుతుంది అట. ఈ చిత్రం లో తమిళ హీరో కార్తీ కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటూ ఒక వార్త తెగ హల్చల్ చేసింది. ఇది రూమర్స్ అని కొందరు, కాదు నిజమే అని మరికొందరు అంటుంటారు. ఈ వార్త వచ్చిన రెండు రోజులకే మరో వార్త సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది. ఇందులో ప్రముఖ తమిళ హీరోనే మాళవిక మోహనన్ ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా లో ఆమెని ట్యాగ్ చేసి ఈ విషయం అభిమానులు అడగ్గా, దానికి ఈరోజు మధ్యాహ్నం ఆమె ట్విట్టర్ ద్వారా రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు చూస్తే ఫ్యాన్స్ కి కాస్త కోపం రావొచ్చు.

ఆమె మాట్లాడుతూ ‘మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న సినిమాలో నేను హీరోయిన్ గా భాగం అయ్యాను అంటూ వార్తలు వస్తున్నాయి. చిరంజీవి గారి పక్కన నటించడం నేను అదృష్టం గా భావిస్తాను. కానీ ఆ అదృష్టం ఇప్పటి వరకు నన్ను వరించలేదు. సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలన్నీ అసత్యాలు. దయచేసి నమ్మకండి అంటూ ఒక ట్వీట్ వేసింది. మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల కాబోతుంది.

​Malavika Mohanan Comments On Chiranjeevi: 70 ఏళ్ళ వయస్సు లో కూడా ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా మెగా స్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత 6 సినిమాలను విడుదల చేసాడు మెగాస్టార్. ‘భోళా శంకర్’ తర్వాత ‘విశ్వంభర’ చిత్రాన్ని మొదలు పెట్టి పూర్తి చేసాడు. సినిమా మొత్తం గ్రాఫిక్స్ మీద ఆధారపడుంది కాబట్టి, అద్భుతమైన క్వాలిటీ కోసం వచ్చే ఏడాది సమ్మర్ కి  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *