తుఫాను బాధిత రైతులకు ప్రజలకు అండగా ఉంటాం
……..మంత్రి కందుల దుర్గేష్
విశాలాంధ్ర – నిడదవోలు : తుఫాన్ బాధిత రైతులకు, ప్రజలకు అండగా ఉంటామని, ఎర్రకాలువ ముంపు దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ రైతాంగానికి భరోసానిచ్చారు. నిడదవోలు నియోజకర్గంలోని ఎర్రకాలువ ఉధృతిని మంత్రి దుర్గేష్ బుధవారం స్వయంగా పరిశీలించారు.స్థానిక రైతాంగంతో మాట్లాడి ఎర్రకాలువ ప్రవాహం, పంట నష్టాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, రైతాంగం అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎర్రకాలువ ప్రవాహ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మార్వో, సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఎర్రకాలువ సమీపంలోని వరి పంట పొలాలు, పండ్లు, కూరగాయల తోటల పరిశీలించారు. పంట నష్టం వివరాలు సేకరించాలని అధికారులకు వెల్లడించారు. ఈ సందర్భంగా నిడదవోలు మండలంలో 17,500 ఎకరాలకు గానూ 6000 ఎకరాల్లో పంట నష్టం చేకూరిందని అధికారులు మంత్రి దుర్గేష్ కు వివరాలు తెలుపగా సంబంధిత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని చేతబట్టుకొని పరిశీలించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కంసాలిపాలెం- మాధవరం మధ్య శాశ్వత బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎర్రకాలువ ప్రవాహ ఉధృతి తగ్గగానే కాలువ గట్ల పటిష్టతకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిడదవోలు రూరల్ మండలంలోని సింగవరం పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు. పునరావాస శిబిరంలో భోజన ఏర్పాట్లపై ప్రజలతో చర్చించారు. సింగవరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న మందులు, స్టాక్ వివరాలపై ఆరా తీశారు. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిస్థితి చక్కబడ్డ వెంటనే ఇళ్లకు పంపించాలని అధికారులకు సూచించారు. ఆర్వో ప్లాంట్లకు ఇబ్బంది లేకుండా జనరేటర్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఇళ్లను, నేలకొరిగిన చెట్లను, స్తంభాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. దగ్గరుండి వాటిని తొలగించారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.అనంతరం ఉండ్రాజవరం, కాల్దారిలో పంట పొలాలను,పెరవలి మండలంలోని ముక్కామల గ్రామంలో అరటి తోటలను స్వయంగా వెళ్లి మంత్రి దుర్గేష్ పరిశీలించారు. అక్కడి రైతాంగంతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. లంక గ్రామాల్లో అరటి తోటలు బాగా దెబ్బతిన్నాయని ఉద్యానరైతులు మంత్రి దుర్గేష్ దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ జాగ్రత్తగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతాంగాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు. నిడదవోలు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లపై చెట్లు పడిపోవడం, స్తంభాలు నేలకొరగడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించామని మంత్రి దుర్గేష్ అన్నారు. కాలువలు, చెరువులు గండిపడకుండా నిత్యం పర్యవేక్షించామన్నారు. ఎక్కడైనా విద్యుత్ కు అంతరాయం కలిగితే సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టామన్నారు. మొంథా తుఫాన్ ఆపత్కాలంలో అధికార యంత్రాంగం పనితీరును మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. అధికార యంత్రాంగాన్ని సంసిద్ధులను చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విలువైన సలహాలు, సూచనలు అందిస్తూ ప్రకృతి విపత్తులను, తుఫాన్ లను ఎదుర్కోవడంలో సమర్థుడిగా సీఎం చంద్రబాబునాయుడు కు గొప్ప పేరుందన్నారు. హుద్ హుద్ తుఫాన్ మాదిరి మొంథా తుఫాన్ నేపథ్యంలో సైతం మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికార యంత్రాంగంతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమాయత్తులను చేసిన విషయాన్ని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు.
The post రైతులకు ప్రజలకు అండగా మంత్రి కందుల appeared first on Visalaandhra.
తుఫాను బాధిత రైతులకు ప్రజలకు అండగా ఉంటాం ……..మంత్రి కందుల దుర్గేష్ విశాలాంధ్ర – నిడదవోలు : తుఫాన్ బాధిత రైతులకు, ప్రజలకు అండగా ఉంటామని, ఎర్రకాలువ ముంపు దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ రైతాంగానికి భరోసానిచ్చారు. నిడదవోలు నియోజకర్గంలోని ఎర్రకాలువ ఉధృతిని మంత్రి దుర్గేష్ బుధవారం స్వయంగా పరిశీలించారు.స్థానిక రైతాంగంతో మాట్లాడి ఎర్రకాలువ ప్రవాహం, పంట నష్టాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, రైతాంగం అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం
The post రైతులకు ప్రజలకు అండగా మంత్రి కందుల appeared first on Visalaandhra.
