Headlines

‘కన్నొదిలి కలనొదిలి..’

అల్లరి నరేష్‌ అప్‌ కమింగ్‌ థ్రిల్లర్‌ ’12 ఎరైల్వే కాలనీ’. ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘పోలిమేర’ సిరీస్‌తో పాపులరైన డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ రాశారు.
మ్యూజిక్‌ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మేకర్స్‌ ఫస్ట్‌ సింగిల్‌ ‘కన్నొదిలి కలనొదిలి’ని విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్‌ లవ్‌ ఫీలింగ్‌ని అందంగా హైలైట్‌ చేస్తుంది. భీమ్స్‌ సాఫ్ట్‌ కంపోజింగ్‌ ఇన్‌స్టంట్‌ హిట్‌ అయ్యింది. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ వోకల్స్‌ ఈ పాటకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది.

ఆయన వాయిస్‌ మ్యాజిక్‌లా ఉంటే, దేవ్‌ పవార్‌ సాహిత్యం అద్భుతంగా ఉంది. అల్లరి నరేష్‌, డాక్టర్‌ కామాక్షి భాస్కర్ల మధ్య కెమిస్ట్రీ లవ్లీగా ఉంది. విజువల్స్‌ చాలా ప్లజెంట్‌గా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా ఎమోషన్స్‌, ప్రేమ, థ్రిల్‌ ఎలిమెంట్స్‌తో మంచి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వనుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. సాయి కుమార్‌, వైవా హర్ష, గెటప్‌ శ్రీను, సద్దాం, జీవన్‌ కుమార్‌, గగన్‌ విహారి, అనీష్‌ కురువిల్లా, మధుమణి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, సమర్పణ: పవన్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, షోరన్నర్‌: డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌, ఎడిటర్‌- డైరెక్టర్‌: నాని కాసరగడ్డ, డిఓపి: కుశేందర్‌ రమేష్‌ రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, వీఎఫ్‌ఎక్స్‌: త్రివేణి కాసరగడ్డ (నియో స్టూడియోస్‌).

The post ‘కన్నొదిలి కలనొదిలి..’ appeared first on Navatelangana.

​అల్లరి నరేష్‌ అప్‌ కమింగ్‌ థ్రిల్లర్‌ ’12 ఎరైల్వే కాలనీ’. ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘పోలిమేర’ సిరీస్‌తో పాపులరైన డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ రాశారు.మ్యూజిక్‌ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మేకర్స్‌ ఫస్ట్‌ సింగిల్‌ ‘కన్నొదిలి కలనొదిలి’ని విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన
The post ‘కన్నొదిలి కలనొదిలి..’ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *