Headlines

‘నేను రెడీ’కి మిక్కీ మ్యూజిక్‌

‘నువ్విలా, జీనియస్‌, రామ్‌ లీలా, సెవెన్‌’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హీరో హవీష్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘నేను రెడీ’. ‘సినిమా చూపిస్తా మామా, నేను లోకల్‌, ధమాకా, మజాకా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించిన త్రినాధ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా హార్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తోంది. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జె మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

మాస్‌ డైరెక్టర్‌ త్రినాధ రావు నక్కిన, మెలోడీ కంపోజర్‌ మిక్కీ జె మేయర్‌ కలిసి పని చేయడంతో ఈ సినిమాలో మాస్‌, మెలోడియస్‌ ట్యూన్‌ల కలయికను ఆశించవచ్చు అని వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘నేను రెడీ’ అనే టైటిల్‌ మంచి రెస్పాన్స్‌తో ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది. శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్‌ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్‌ రాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: త్రినాధరావు నక్కిన, నిర్మాత: నిఖిల కోనేరు, డీఓపీ : నిజార్‌ షఫీ, సంగీతం: మిక్కీ జె మేయర్‌, కథ, మాటలు: విక్రాంత్‌ శ్రీనివాస్‌, ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి, యాక్షన్‌: రామకృష్ణ.

The post ‘నేను రెడీ’కి మిక్కీ మ్యూజిక్‌ appeared first on Navatelangana.

​‘నువ్విలా, జీనియస్‌, రామ్‌ లీలా, సెవెన్‌’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హీరో హవీష్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘నేను రెడీ’. ‘సినిమా చూపిస్తా మామా, నేను లోకల్‌, ధమాకా, మజాకా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించిన త్రినాధ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా హార్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తోంది. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జె మేయర్‌ ఈ
The post ‘నేను రెడీ’కి మిక్కీ మ్యూజిక్‌ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *