Headlines

ఏఐటీయూసీ ఆవిర్భవ  దినోత్సవం లో రేఖా భాస్కరరావు

ఘనంగా ఏఐటీయూసీ 106 వ ఆవిర్భవ  దినోత్సవం 

కార్మికులకు విప్లవ శుభా కాంక్షలు తెలియజేసిన 

 ఏ ఐ.టి..యు.సి. రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రేఖా భాస్కరరావు 

విశాలాంధ్ర – నిడదవోలు : ఏఐ.టి.యు.సి 106 వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిడదవోలులో ఎ.ఐ.టి.యు.సి. ఏరియా  సమితి  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భముగా పలు కార్మిక  సంస్థల వద్ద ఎ.ఐ.టియుసి పతకాల్ని  ఆవిష్కరించిన  ఎ.ఐ.టి.యు.సి  నాయకులు  కార్యకర్తలు నిడదవోలు మెయిన్ రోడ్ లో  పొట్టిశ్రీరాములు విగ్రహము వద్ద శ్రీ వెంకటేశ్వరా జట్ల సంఘం ఆధ్వర్యంలో ఎ. ఐ.టియుసి పతకాన్నిఎ.ఐ.టి.యు.సి. నాయకులు రేఖా భాస్కరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భముగా  రేఖా భాస్కరరావు మాట్లాడుతూ  1920 అక్టోబరు 31 వ తేదీన  ఏర్పడిన ఎ.ఐ.టి.యు.సి. దేశం లోనే ప్రప్రథమ కార్మికసంస్థ  అని స్వాతంత్ర్యపోరాటములో  ఎ.ఐ.టియుసి కీలక పాత్ర పోషించిందని. శ్రామిక హక్కుల పరిరక్షణలో ఎ.ఐ.టి.యు.సి.  పాత్ర మరువ లేనిదన్నారు .కార్మిక చట్టాల రూప కల్పనలో , కార్మిక హక్కుల పరిరక్షణలో ఎ.ఐ.టి.యు.సి. పాత్ర చిరస్మరణీయమని , ప్రస్తుతం కేంద్రంలో మతోన్మాద బి.జె.పి. ప్రభుత్వం కార్మిక హక్కుల పై దాడి చేస్తుందని, కార్పోరేట్లు కు అనుకూలంగా  44 కార్మిక చట్టాలను 4, కోడ్ లు గా మార్చిందని, యిప్పటికే  29 కార్మిక చట్టాలు రద్దుచేసిందని  ,  విశాఖ స్టీల్ సహా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకున్నదని , దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఆదివాసీలు,గిరిజనులు, దళితులు,మహిళలు , మైనారీటిల పై దాడులు పెరిగాయని, కేంద్రం లో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని , దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నరేంద్రమోదీ కి అనుకూలంగా  కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని, కార్పొరేట్లును ప్రసన్నం చేసుకోవటానికి 12 గంటల పనిదినానికి చట్టం చేసిందని , విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ను నిలుపుదల చేయడంలో ఘోరంగా  విఫలమయిందని, ప్రత్యేక హోదా మాటే మార్చి పోయిందని , ఎన్నికల వాగ్దానాలు అమలులో విఫలమైందని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు భవిష్యత్ పోరాట కార్యక్రమానికి  ఏఐటీయూసీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపిచ్చారు -కార్యక్రమంలో  ఎ. ఐ.. టి.యు.సి, నాయకులు మాముడూరి నాగేంద్ర వర ప్రసాద్ , మెయిలి శ్రీను, రామిశెట్టి సత్తిబాబు, బీజా అప్పారావు,కోసూరి శ్రీను,,  మామిడిసన్యా సిరావు, రొంగల శ్రీను, పెంటపాటి వెంకట్రావు,  బద్ది సూరిబాబు,చోడిశెట్టి లోవరాజు , జల్లా వెంకటేశులు,   నంద్యాల వీర్రాజు పొలిమాటి తాతబ్బాయి,, గాడిరవి,  ఖండవల్లి మాణిక్యం,క్రొవ్విడి నాగరాజు, క్రివ్విడి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

The post ఏఐటీయూసీ ఆవిర్భవ  దినోత్సవం లో రేఖా భాస్కరరావు appeared first on Visalaandhra.

​ఘనంగా ఏఐటీయూసీ 106 వ ఆవిర్భవ  దినోత్సవం  కార్మికులకు విప్లవ శుభా కాంక్షలు తెలియజేసిన   ఏ ఐ.టి..యు.సి. రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రేఖా భాస్కరరావు  విశాలాంధ్ర – నిడదవోలు : ఏఐ.టి.యు.సి 106 వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిడదవోలులో ఎ.ఐ.టి.యు.సి. ఏరియా  సమితి  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భముగా పలు కార్మిక  సంస్థల వద్ద ఎ.ఐ.టియుసి పతకాల్ని  ఆవిష్కరించిన  ఎ.ఐ.టి.యు.సి  నాయకులు  కార్యకర్తలు నిడదవోలు మెయిన్ రోడ్ లో  పొట్టిశ్రీరాములు విగ్రహము వద్ద శ్రీ
The post ఏఐటీయూసీ ఆవిర్భవ  దినోత్సవం లో రేఖా భాస్కరరావు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *