Headlines

పి హెచ్ సి లను సందర్శించిన జిల్లా బాస్ 

విశాలాంధ్ర – దేవరపల్లి /కొవ్వూరు : తూర్పు గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. వేంకటేశ్వర రావు శనివారం తుఫాను అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు దొమ్మేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), దేవరపల్లి PHCలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో జరుగుతున్న తుఫాను అనంతర వైద్య చర్యలు, నీటి నిల్వల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, గృహ సర్వే కార్యక్రమాలను పరిశీలించారు. జ్వర పీడితులను గుర్తించి తక్షణ చికిత్స అందేలా చూడాలని, వైద్య సిబ్బంది గ్రామాల వారీగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డాక్టర్ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ తుఫాను తరువాత సీజనల్ వ్యాధుల వ్యాప్తి అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, ప్రతి కుటుంబం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, పర్యావరణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. నీటి నిల్వలు, పాలు పాత్రలు శుభ్రంగా ఉంచడం, దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి,” అని తెలిపారు. సంబంధిత వైద్య అధికారులు, ANMs, ఆరోగ్య సిబ్బందికి ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వెక్టర్ మరియు వాటర్ బోర్న్ వ్యాధుల నివారణ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించే దిశగా ఆరోగ్య విభాగం ఫీల్డ్‌ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

The post పి హెచ్ సి లను సందర్శించిన జిల్లా బాస్  appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – దేవరపల్లి /కొవ్వూరు : తూర్పు గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. వేంకటేశ్వర రావు శనివారం తుఫాను అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు దొమ్మేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), దేవరపల్లి PHCలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో జరుగుతున్న తుఫాను అనంతర వైద్య చర్యలు, నీటి నిల్వల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, గృహ సర్వే కార్యక్రమాలను పరిశీలించారు. జ్వర పీడితులను గుర్తించి తక్షణ చికిత్స అందేలా చూడాలని, వైద్య
The post పి హెచ్ సి లను సందర్శించిన జిల్లా బాస్  appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *