ఉత్పత్తి తగ్గింది.. ధర పెరిగింది..
విశాలాంధ్ర – కొవ్వూరు : శీతాకాల ప్రభావంతో మరోవైపు చల్లగాలులు పెరగడంతో జిల్లావ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో వినియోగదారులపై ధరల భారం పడింది. సాధారణంగా కార్తీక మాసంలో ఎక్కువమంది శాకాహారమే తింటారు. అయినా సరే కోడి గుడ్డకు మంచి డిమాండ్ పెరిగింది. చలి తీవ్రత పెరిగేకొద్దీ గుడ్డు ధర మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ రకాల వైరస్లతో సతమతమైన కోళ్ల పరిశ్రమకు సంక్రాంతి వరకు మంచి రోజులు ఉంటాయని కోళ్ల రైతులు ఆశిస్తున్నారు. స్థానికంగా వినియోగం తగ్గిన ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండడంతోఈ డిమాండ్ పెరిగినట్లు తెలుస్తుంది. మన జిల్లాలో ఉత్పత్తి అయిన కోడిగుడ్లు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆ రాష్ట్రాలలో చలి తీవ్రతను తట్టుకునేందుకు కోడిగుడ్లు అది కూడా తింటారు. అక్కడ గణనీయంగా వినియోగం పెరగడంతో ఈ డిమాండ్ నెలకొంది. కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, తణుకు మండలాలతో సహా పలు మండలాలలో కోళ్ల ఫారాలు అధికంగా ఉన్నాయి. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు కోటి కోడిగుడ్ల వరకు ఉత్పత్తి అయ్యేవి. అయితే ఈ పరిశ్రమకు ప్రతికూల పరిస్థితులు. కొన్ని కోళ్ల ఫారాలు తొలగించటం వల్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గి ప్రస్తుతం 70 లక్షల వరకు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70 శాతం వరకు పశ్చిమబెంగాల్, అస్సాములకు,బీహార్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా 30 శాతాన్ని స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపద్యంలో మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే కోడిగుడ్ల మీద అక్కడ ప్రజలు ఆధారపడతారు. గత నెల 22న ఐదు యాభై మూడు పైసలు గుడ్డు ధర ఉండగా ఇప్పుడు ఐదు రూపాయల 80 పైసలకు చేరింది. గత ఏడాది ఇదే రోజు తో పోలిస్తే 30 పైసలు అదనంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోడిగుడ్ల ధర కొంతమేర పెరిగే అవకాశం ఉందని కోళ్ల రైతులు ఆశిస్తున్నారు
The post శీతాకాల ప్రభావం.. వినియోగదారులకు భారం appeared first on Visalaandhra.
ఉత్పత్తి తగ్గింది.. ధర పెరిగింది.. విశాలాంధ్ర – కొవ్వూరు : శీతాకాల ప్రభావంతో మరోవైపు చల్లగాలులు పెరగడంతో జిల్లావ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో వినియోగదారులపై ధరల భారం పడింది. సాధారణంగా కార్తీక మాసంలో ఎక్కువమంది శాకాహారమే తింటారు. అయినా సరే కోడి గుడ్డకు మంచి డిమాండ్ పెరిగింది. చలి తీవ్రత పెరిగేకొద్దీ గుడ్డు ధర మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ రకాల వైరస్లతో సతమతమైన కోళ్ల పరిశ్రమకు
The post శీతాకాల ప్రభావం.. వినియోగదారులకు భారం appeared first on Visalaandhra.
