–
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు
బంద్ కొనసాగిస్తామన్న యాజమాన్యాలు
అన్ని యూనివర్సిటీల్లో పరీక్షలు వాయిదా..?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి నిరవధికంగా బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విధించిన గడువు ముగియంతో నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ వృత్తి విద్య, డిగ్రీ కాలేజీలు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం(నవంబర్ 3) నుంచి నిరవధిక బంద్ పాటించనున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వరకూ కొనసాగించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నాయకులు ఇప్పటికే ప్రకటించారు.అప్పటివరకు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు వాయిదా పడనున్నాయి. రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని ఈ బంద్‌లో పాల్గొంటాయని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నాయకులు ఇప్పటికే వెల్లడించారు. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బి.ఎడ్, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు బంద్‌లో పాల్గొంటాయని తెలిపారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల నిరసనలో భాగంగా ఈ నెల 6న లక్ష నుంచి లక్ష యాభై వేల మంది అధ్యాపకులు, కళాశాలల సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నారు.అలాగే ఈ నెల 10 లేదా 11వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో నిరసన తెలియజేస్తామని ఇప్పటికే ఫెడరేషన్ నాయకులు చెప్పారు. తమ నిరసనలో భాగంగా మంత్రుల ఇళ్ల ముట్టడితో పాటు నియోజకవర్గాలలో ఎంఎల్ఎల ఇండ్లను ముట్టడిస్తామని అన్నారు. అలాగే జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో బోధన ఫీజులపై ప్రభుత్వ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కొన్ని విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను తప్పుగా వినియోగిస్తున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థలు, కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక అందించాలని సిఎస్ కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తనిఖీల కోసం పోలీసు, సిఐడి, ఎసిబి, ఇంటెలిజెన్స్, పోలీసు కమిషనరేట్ల సహాయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తమకు న్యాయంగా రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా..? అంటూ ప్రైవేట్ యాజమాన్యాల ప్రతినిధులు మండిపడుతున్నారు. బకాయిల గురించి అడిగినప్పుడే తమ కాలేజీలపై విజిలెన్స్ విచారణలు చేస్తున్నారని, తమను భయపెడితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్మెయిల్ చేయడమే అని పేర్కొన్నారు. నాలుగు కాలేజీలకు విడుదల చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులపైనా, అనర్హులకు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులను విజిలెన్స్ విచారణలో భాగం చేయాలని డిమాండ్ చేశారు.