
మన తెలంగాణ/హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగనుంది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్ 9 జారీ చేసింది. దీనిపై మాదవ్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు జరిపిన సిజె ధర్మాసనం జీఓ నెంబర్ 9 ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది. ఈ ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ సైతం విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రద్దు చేసింది. ప్రభుత్వం నిర్ణయం తరువాత ఈ అంశంపై ముందుకు వెళతామని ఇసి స్పష్టం చేసింది.
అయితే ప్రభుత్వం మాత్రం తదుపరి విచారణ వరకు వేచి చూడకుండా, స్పెషల్ లీవ్ పిటిషన్‌తో సుప్రీం కోర్టు తలుపు తట్టింది. అక్కడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులో విచారణలో ఉండగా జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ క్రమంలో హైకోర్టులో విచారణ కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కాగా, ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు నిర్ణయం తరువాతనే ముందుకు వెళతామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టులో జరుగనున్న విచారణ సర్వత్రా ఆసక్తిగా మారనుంది.
మన తెలంగాణ/హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగనుంది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్ 9 జారీ చేసింది. దీనిపై మాదవ్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు జరిపిన సిజె ధర్మాసనం జీఓ నెంబర్ 9 ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది. ఈ ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ సైతం విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రద్దు చేసింది. ప్రభుత్వం నిర్ణయం తరువాత ఈ అంశంపై ముందుకు వెళతామని ఇసి స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం తదుపరి విచారణ వరకు వేచి చూడకుండా, స్పెషల్ లీవ్ పిటిషన్‌తో సుప్రీం కోర్టు తలుపు తట్టింది. అక్కడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులో విచారణలో ఉండగా జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ క్రమంలో హైకోర్టులో విచారణ కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కాగా, ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు నిర్ణయం తరువాతనే ముందుకు వెళతామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టులో జరుగనున్న విచారణ సర్వత్రా ఆసక్తిగా మారనుంది.
