
పెద్దోళ్ల భవంతులు కూల్చే ధైర్యం లేదు
మేం అధికారంలోకి రాగానే హైడ్రా బాధితులకు న్యాయం చేస్తాం
మా పదేళ్ల పాలనలో నిర్మాణాలు.. కాంగ్రెస్ హయాంలో కూల్చివేతలు
డిప్యూటీ సిఎం భట్టి చెప్పిన బడా బిల్డర్లపై చర్యలేవి? ఎంఎల్ఎ అరికెపూడి
భూఆక్రమణలకు ఫెన్సింగ్ వేసి రక్షిస్తున్నారు
పేదోళ్ల ఇళ్లు బుల్డోజర్లతో కూల్చుతుంటే రాహుల్ నోరు మెదరపరేం?
కెటిఆర్ ధ్వజం హైడ్రా కూల్చివేతలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో హైడ్రా బాధితులను ఆదుకుంటామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకో న్యాయం, పెద్దోళ్లకో న్యాయమనే రీతిలో పనిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోందని, హైడ్రా పేదల ఇళ్లను కూల్చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిన వారికి బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.మరో 500 రోజుల్లో తిరిగి రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించిన పెద్దోళ్ల విషయంలో హైడ్రా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
తాము పదేళ్లు అధికారంలో ఉన్నా ఎవరికీ అన్యాయం చేయలేదని, పేదలకు న్యాయం చేసేలా పాలన చేశామని చెప్పారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో హైడ్రా ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైడ్రా కూల్చివేతలపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పిపిటి) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి.. కానీ కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలే కనిపిస్తున్నాయని విమర్శించారు. కెసిఆర్ పాలనలో సచివాలయం, టీ హబ్, వీ హబ్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించామని గుర్తుచేశారు.
హైదరాబాద్ నగరంలో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్, బ్రిడ్జిలు నిర్మించామని చెప్పారు.లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టామని, కొత్త సచివాలయం నిర్మించామని చెప్పారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుని కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నామని, కరువు నేలగా ఉన్న తెలంగాణకు నీళ్లు తీసుకురావడానికి ప్రాజెక్టులు నిర్మించామని అన్నారు. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదని దుయ్యబట్టారు.
భట్టి విక్రమార్క చెప్పిన బడా బిల్డర్లపై చర్యలు ఏవీ..?
హైడ్రాపై పిపిటి పేరుతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క 15 ప్రాజెక్టుల పేర్లు చెప్పారని.. కానీ ఇప్పటివరకూ ఒక్క బిల్డర్లపై కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని కెటిఆర్ ప్రశ్నించారు. హైడ్రా చేసేది మంచే అయితే భట్టి విక్రమార్క చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవని మండిపడ్డారు. ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పొంగులేటి ఇంటిని కూల్చే ధైర్యం ఉందా..? అని ప్రశ్నించారు. మంత్రి వివేక్ ఇల్లు, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని చెప్పారు. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్‌హౌస్ చెరువు మధ్యలో ఉందని, శాసనమండల చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఇల్లు చెరువు పక్కనే ఉందని పేర్కొన్నారు.
వీరిపై చర్యలు ఉండవు కానీ.. సున్నం చెరువు వద్ద పేదల ఇళ్లను మాత్రం వెంటనే కూల్చి వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజులరామారం వద్ద బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంఎల్ఎ అరికెపూడి గాంధీ భూమిని అలానే ఉంచారని.. పేదల ఇల్లు మాత్రం కూల్చివేశారని మండిపడ్డారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టే ఆయన భూమిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సిఎం ఒత్తిడితో అధికారులు అక్కడ ఉండే ఆయన భూమికి ఫెన్సింగ్ వేశారని చెప్పారు. మూసీ నదిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టును మంత్రులు, అధికారులు ఎందుకు కూల్చలేదని నిలదీశారు. యుపిలో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటానన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో బుల్డోజర్ పేదల ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టా ఇస్తుంది..రిజిస్ట్రేషన్ చేస్తుంది..కానీ అదే ప్రభుత్వం కూల్చివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దోళ్ల కోసం ఇందిరాగాంధీ ఇచ్చిన పట్టాలు రద్దు చేశారు
1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే ప్రోత్సాహం కింద కొండాపూర్‌లో ఇందిరమ్మ కాలనీలో ఆ రోజు పట్టాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ ఇందిరమ్మ కాలనీలో పెద్దవాళ్ల కోసం ఇందిరాగాంధీ ఇచ్చిన పట్టాలు రద్దు చేసి వాళ్లను అక్కడి నుంచి పంపించామని విమర్శించారు. హైడ్రా చేసేది కరెక్టే అయితే నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి, శనివారం, ఆదివారం ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా కూల్చివేతలు తప్పన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్ల కూల్చివేతలపై న్యాయస్థానాలకు వెళ్లడంతోపాటు అసెంబ్లీలో మాట్లాడతానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు లేకుండానే తమ ఇళ్ళను హైడ్రా అధికారులు కూల్చివేశారని కన్నీటి పర్యంతమయ్యారు. సామాన్లు సైతం తీసుకోకుండా కూల్చివేయడంతో రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దోళ్ల భవంతులు కూల్చే ధైర్యం లేదు
మేం అధికారంలోకి రాగానే హైడ్రా బాధితులకు న్యాయం చేస్తాంమా పదేళ్ల పాలనలో నిర్మాణాలు.. కాంగ్రెస్ హయాంలో కూల్చివేతలుడిప్యూటీ సిఎం భట్టి చెప్పిన బడా బిల్డర్లపై చర్యలేవి? ఎంఎల్ఎ అరికెపూడిభూఆక్రమణలకు ఫెన్సింగ్ వేసి రక్షిస్తున్నారుపేదోళ్ల ఇళ్లు బుల్డోజర్లతో కూల్చుతుంటే రాహుల్ నోరు మెదరపరేం? కెటిఆర్ ధ్వజం హైడ్రా కూల్చివేతలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో హైడ్రా బాధితులను ఆదుకుంటామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకో న్యాయం, పెద్దోళ్లకో న్యాయమనే రీతిలో పనిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోందని, హైడ్రా పేదల ఇళ్లను కూల్చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిన వారికి బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.మరో 500 రోజుల్లో తిరిగి రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించిన పెద్దోళ్ల విషయంలో హైడ్రా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నా ఎవరికీ అన్యాయం చేయలేదని, పేదలకు న్యాయం చేసేలా పాలన చేశామని చెప్పారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో హైడ్రా ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైడ్రా కూల్చివేతలపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పిపిటి) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి.. కానీ కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలే కనిపిస్తున్నాయని విమర్శించారు. కెసిఆర్ పాలనలో సచివాలయం, టీ హబ్, వీ హబ్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించామని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్, బ్రిడ్జిలు నిర్మించామని చెప్పారు.లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టామని, కొత్త సచివాలయం నిర్మించామని చెప్పారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుని కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నామని, కరువు నేలగా ఉన్న తెలంగాణకు నీళ్లు తీసుకురావడానికి ప్రాజెక్టులు నిర్మించామని అన్నారు. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదని దుయ్యబట్టారు.
భట్టి విక్రమార్క చెప్పిన బడా బిల్డర్లపై చర్యలు ఏవీ..?
హైడ్రాపై పిపిటి పేరుతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క 15 ప్రాజెక్టుల పేర్లు చెప్పారని.. కానీ ఇప్పటివరకూ ఒక్క బిల్డర్లపై కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని కెటిఆర్ ప్రశ్నించారు. హైడ్రా చేసేది మంచే అయితే భట్టి విక్రమార్క చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవని మండిపడ్డారు. ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పొంగులేటి ఇంటిని కూల్చే ధైర్యం ఉందా..? అని ప్రశ్నించారు. మంత్రి వివేక్ ఇల్లు, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని చెప్పారు. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్‌హౌస్ చెరువు మధ్యలో ఉందని, శాసనమండల చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఇల్లు చెరువు పక్కనే ఉందని పేర్కొన్నారు. వీరిపై చర్యలు ఉండవు కానీ.. సున్నం చెరువు వద్ద పేదల ఇళ్లను మాత్రం వెంటనే కూల్చి వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజులరామారం వద్ద బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంఎల్ఎ అరికెపూడి గాంధీ భూమిని అలానే ఉంచారని.. పేదల ఇల్లు మాత్రం కూల్చివేశారని మండిపడ్డారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టే ఆయన భూమిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సిఎం ఒత్తిడితో అధికారులు అక్కడ ఉండే ఆయన భూమికి ఫెన్సింగ్ వేశారని చెప్పారు. మూసీ నదిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టును మంత్రులు, అధికారులు ఎందుకు కూల్చలేదని నిలదీశారు. యుపిలో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటానన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో బుల్డోజర్ పేదల ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టా ఇస్తుంది..రిజిస్ట్రేషన్ చేస్తుంది..కానీ అదే ప్రభుత్వం కూల్చివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దోళ్ల కోసం ఇందిరాగాంధీ ఇచ్చిన పట్టాలు రద్దు చేశారు
1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే ప్రోత్సాహం కింద కొండాపూర్‌లో ఇందిరమ్మ కాలనీలో ఆ రోజు పట్టాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ ఇందిరమ్మ కాలనీలో పెద్దవాళ్ల కోసం ఇందిరాగాంధీ ఇచ్చిన పట్టాలు రద్దు చేసి వాళ్లను అక్కడి నుంచి పంపించామని విమర్శించారు. హైడ్రా చేసేది కరెక్టే అయితే నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి, శనివారం, ఆదివారం ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా కూల్చివేతలు తప్పన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్ల కూల్చివేతలపై న్యాయస్థానాలకు వెళ్లడంతోపాటు అసెంబ్లీలో మాట్లాడతానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు లేకుండానే తమ ఇళ్ళను హైడ్రా అధికారులు కూల్చివేశారని కన్నీటి పర్యంతమయ్యారు. సామాన్లు సైతం తీసుకోకుండా కూల్చివేయడంతో రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
