Headlines

సమాచార బాహుబలి

సిఎంఎస్03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్

జిటిఓలోకి సక్సెస్‌ఫుల్‌గా చేర్చిన స్వదేశీ రాకెట్ ఎల్‌విఎం3ఎం5

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

అధునాతన సమాచార వ్యవస్థ, సముద్ర వాతావరణ పరిస్థితులపై అధ్యయనం

నౌకాదళానికి అత్యంత ఉపయుక్తం, జిశాట్7కు ప్రత్యామ్నాయం

ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు : ఇస్రో చైర్మన్

ఇస్రో మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం నాడు దేశ కమ్యూనికేషన్ రంగం విస్తరణ దిశలో దేశీయ బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. సిఎంఎస్3 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఓ)లోకి శాస్త్రవేత్తలు సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశపెట్టారు. ఆదివారం సాయంత్రం సరిగ్గా 5:26 నిమిషాలకు దేశీయంగా తయారు చేసిన ఎల్‌విఎం3ఎం5 వాహక నౌక ద్వారా 4,410 కేజీల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని నిర్ధిష్ట కక్షలోకి చేర్చింది. ఇంత భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించండం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి.

శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్) : దేశ కమ్యూనికేషన్ రంగం విస్తరణ దిశలో దేశీయ బాహుబలి రాకెట్ ఆదివారం సరికొత్త చరిత్రను సృష్టించింది. భారతీ య అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమ వి శ్వసనీయ దేశీయ నిర్మిత ఎల్‌విఎం3ఎం5 రాకె ట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకువెళ్లగా విజయవంతంగా అత్యంత కీలకమైన క మ్యూనికేషన్ శాటిలైట్ సిఎంఎస్03ని నిర్ణీత కక్షలోకి ప్ర వేశపెట్టింది. సాయంత్రం సరిగ్గా 5.26 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. బాహుబలి భేష్ అన్పించుకుంది. పేరుకు తగ్గట్లుగానే బాహుబలిగా నిలిచిం ది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని శ్రీహరికోట సతీష్ ధా వన్ ప్రయోగ స్థలి నుంచి 4410 కిలోల ఈ శాటిలైట్‌ను గురి చూసి నిర్ణీత కక్షలోకి చేర్చడం ద్వా రా ఇస్రో ఇతర అంతరిక్ష సంస్థలను విస్తుపోయే లా చేసింది. 2013లో కక్షలో ఉన్న జిశాట్ 7 సీరిస్‌కు బదులుగా ఈ శాటిలైట్‌ను పంపించారు. ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

బాహుబలి రాకెట్ నుంచి ఈ శాటిలైట్ నిర్ణీత భూమ్యాక్షర్షణ ప్రభావ రహిత జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఒ)లోకి చేరిందని తెలిపా రు. ఇక ఈ వినూత్న తరం దేశీయ రాకెట్ నుంచి పంపించిన శాటిలైట్ బహుళార్థక సాధకం. ఈ మ ల్టీ బాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనుకున్న వి ధంగా తన స్థావరం నుంచి పనిచేయడం ఆరంభిస్తే అది దేశ పలు రంగాలకు సంబంధించి కీలక సమాచార వినిమయానికి మైలురాయి అవుతుంది. సముద్ర ప్రాంతాలు, భూమి, భారతీయ భూమి మ్యాప్‌లు అంతర్గత స్వభావం వంటి వాటిని సేకరించేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. సైనిక దళాలకు, నావిక బలగానికి అవసరమయిన కీలక సమాచారం అందించేందుకు ఈ శాటిలైట్ ఉపయుక్తం అవుతుంది. అత్యంత భారీస్థాయి శా టిలైట్లను, ప్రయోగ పరికరాలను తీసుకువెళ్లగలిగే సామర్థం ఉండటంతో వాహకనౌకకు బాహుబలి అని పేరు పెట్టారు. ఎల్‌విఎం 3 శాటిలైట్ గర్వకారణం అని ఇస్రో అధినేత ప్రకటించారు. ఇంతకు ముందు ఈ రాకెట్ ద్వారా చేపట్టిన మొత్తం ఎనిమిది ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఇది ఇందులో మరోటి అని ఇస్రో తెలిపింది.

15 ఏళ్ల పాటు సేవలందించే ఉపగ్రహం

ఇప్పుడు కమ్యూనికేషన్ రంగంలో కీలకమైన శా టిలైట్ ద్వారా వివిధ రంగాలకు 15 సంవత్సరాల పాటు సేవలు అందుతాయి. ఈ ప్రయోగం విజయవంతం దేశ ఆత్మనిర్బరత సాధన దిశలో మరో ముందడుగు అని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ఓ వైపు మబ్బుపట్టిన ప్రతికూల వాతావరణం, భారీ శాటిలైట్ ఈ దశలో ఇస్రో సైంటిస్టులు, సాంకేతిక సి బ్బందికి ప్రయోగం దశ వరకూ తీవ్ర టెన్షన్ ఎదురైంది. అయితే అన్నింటిని అధిగమించడం ద్వారా రాకెట్ సామర్థతను చాటుకుంటూ ముందుకు వెళ్లడం, శాటిలైట్ కక్షలోకి చేరడం జరిగింది.  

​సిఎంఎస్03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్జిటిఓలోకి సక్సెస్‌ఫుల్‌గా చేర్చిన స్వదేశీ రాకెట్ ఎల్‌విఎం3ఎం5
ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం
అధునాతన సమాచార వ్యవస్థ, సముద్ర వాతావరణ పరిస్థితులపై అధ్యయనం
నౌకాదళానికి అత్యంత ఉపయుక్తం, జిశాట్7కు ప్రత్యామ్నాయం
ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు : ఇస్రో చైర్మన్

ఇస్రో మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం నాడు దేశ కమ్యూనికేషన్ రంగం విస్తరణ దిశలో దేశీయ బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. సిఎంఎస్3 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఓ)లోకి శాస్త్రవేత్తలు సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశపెట్టారు. ఆదివారం సాయంత్రం సరిగ్గా 5:26 నిమిషాలకు దేశీయంగా తయారు చేసిన ఎల్‌విఎం3ఎం5 వాహక నౌక ద్వారా 4,410 కేజీల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని నిర్ధిష్ట కక్షలోకి చేర్చింది. ఇంత భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించండం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి.శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్) : దేశ కమ్యూనికేషన్ రంగం విస్తరణ దిశలో దేశీయ బాహుబలి రాకెట్ ఆదివారం సరికొత్త చరిత్రను సృష్టించింది. భారతీ య అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమ వి శ్వసనీయ దేశీయ నిర్మిత ఎల్‌విఎం3ఎం5 రాకె ట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకువెళ్లగా విజయవంతంగా అత్యంత కీలకమైన క మ్యూనికేషన్ శాటిలైట్ సిఎంఎస్03ని నిర్ణీత కక్షలోకి ప్ర వేశపెట్టింది. సాయంత్రం సరిగ్గా 5.26 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. బాహుబలి భేష్ అన్పించుకుంది. పేరుకు తగ్గట్లుగానే బాహుబలిగా నిలిచిం ది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని శ్రీహరికోట సతీష్ ధా వన్ ప్రయోగ స్థలి నుంచి 4410 కిలోల ఈ శాటిలైట్‌ను గురి చూసి నిర్ణీత కక్షలోకి చేర్చడం ద్వా రా ఇస్రో ఇతర అంతరిక్ష సంస్థలను విస్తుపోయే లా చేసింది. 2013లో కక్షలో ఉన్న జిశాట్ 7 సీరిస్‌కు బదులుగా ఈ శాటిలైట్‌ను పంపించారు. ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. బాహుబలి రాకెట్ నుంచి ఈ శాటిలైట్ నిర్ణీత భూమ్యాక్షర్షణ ప్రభావ రహిత జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఒ)లోకి చేరిందని తెలిపా రు. ఇక ఈ వినూత్న తరం దేశీయ రాకెట్ నుంచి పంపించిన శాటిలైట్ బహుళార్థక సాధకం. ఈ మ ల్టీ బాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనుకున్న వి ధంగా తన స్థావరం నుంచి పనిచేయడం ఆరంభిస్తే అది దేశ పలు రంగాలకు సంబంధించి కీలక సమాచార వినిమయానికి మైలురాయి అవుతుంది. సముద్ర ప్రాంతాలు, భూమి, భారతీయ భూమి మ్యాప్‌లు అంతర్గత స్వభావం వంటి వాటిని సేకరించేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. సైనిక దళాలకు, నావిక బలగానికి అవసరమయిన కీలక సమాచారం అందించేందుకు ఈ శాటిలైట్ ఉపయుక్తం అవుతుంది. అత్యంత భారీస్థాయి శా టిలైట్లను, ప్రయోగ పరికరాలను తీసుకువెళ్లగలిగే సామర్థం ఉండటంతో వాహకనౌకకు బాహుబలి అని పేరు పెట్టారు. ఎల్‌విఎం 3 శాటిలైట్ గర్వకారణం అని ఇస్రో అధినేత ప్రకటించారు. ఇంతకు ముందు ఈ రాకెట్ ద్వారా చేపట్టిన మొత్తం ఎనిమిది ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఇది ఇందులో మరోటి అని ఇస్రో తెలిపింది.
15 ఏళ్ల పాటు సేవలందించే ఉపగ్రహం
ఇప్పుడు కమ్యూనికేషన్ రంగంలో కీలకమైన శా టిలైట్ ద్వారా వివిధ రంగాలకు 15 సంవత్సరాల పాటు సేవలు అందుతాయి. ఈ ప్రయోగం విజయవంతం దేశ ఆత్మనిర్బరత సాధన దిశలో మరో ముందడుగు అని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ఓ వైపు మబ్బుపట్టిన ప్రతికూల వాతావరణం, భారీ శాటిలైట్ ఈ దశలో ఇస్రో సైంటిస్టులు, సాంకేతిక సి బ్బందికి ప్రయోగం దశ వరకూ తీవ్ర టెన్షన్ ఎదురైంది. అయితే అన్నింటిని అధిగమించడం ద్వారా రాకెట్ సామర్థతను చాటుకుంటూ ముందుకు వెళ్లడం, శాటిలైట్ కక్షలోకి చేరడం జరిగింది.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *