Headlines

అష్టాంగ ఆందోళన

రాష్ట్రంలో రిజర్వేషన్‌ల ఉద్యమం మరింత ఉధృతం

అష్టాంగ ఆందోళన పేరుతో బిసి జెఎసి ఉద్యమ కార్యాచరణ

ఇక పల్లె పల్లెకు పోరాటం.. నవంబర్ లో పార్లమెంటు ముట్టడి

నేటి ఉద్యమం రేపటి సామాజిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది

జెండాలు వదిలి ఒకే ఎజెండాతో ముందుకు

బిసి జెఎసి విస్తృత స్థాయి సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, సంఘాలు

బిసి రిజర్వేషన్ల విషయంలో ఇక ప్రత్యక్ష సమరమే

బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు 42 శాతం సాధించేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని బిసి జెఎసి నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్, బంజారాహిల్స్ లోని కళింగ కల్చరర్ సెంటర్ లో బిసి జెఎసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 42 శాతం బిసి రిజర్వేషన్‌ల పెంపుకు భవిష్యత్ కార్యాచరణ పై చర్చించి అష్టాంగ ఆందోళన పేరుతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీల నేతలు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, మాజీ ఎంపి వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎంఎల్‌సి అద్దంకి దయాకర్, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, ప్రముఖ సినీ నటులు ఆర్. నారాయణమూర్తి, సినీ దర్శకులు ఎన్ శంకర్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలురీ గౌరీశంకర్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, బిసి జెఎసి కో చైర్మన్ దాసు సురేష్, కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ నాయకులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ, న్యాయవాద, డాక్టర్స్, మేధావుల సంఘాల నేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నుండి ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు వేలాదిమంది హాజరయ్యారు.

ఈనెల 20 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేసి బిసి రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెల్పాల్సిందేనని, లేదంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు బిసిలు ప్రత్యక్ష పోరాటానికి పూనుకుంటారని సమావేశం హెచ్చరించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బిసి జెఎసి సమావేశానికి బిజెపి నేతగా రాలేదని, ఒక బిసి బిడ్డగా హాజరయ్యానని అన్నారు. బిసి రిజర్వేషన్ల సాధన కోసం బిసి జెఎసి పోరాటానికి తన వంతు మద్దతు ఉంటుందన్నారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదని రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక వర్గాలలో బిసిలకే అన్యాయం జరుగుతోందని అన్నారు. దగా పడ్డ బిసిలు దండుగట్టే సమయం ఆసన్నమైందన్నారు ఏ రాజకీయ పార్టీకి చెందని నిస్వార్థ, నిజాయితీతో బిసిల కోసం ఉద్యమించేవారు బిసి జెఎసి నాయకత్వం వహించాలని, గమ్యాన్ని ముద్దాడె వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు .

వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు: బిహెచ్, బీర్ల, ఈరావత్

బిసి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గే ప్రసక్తి లేదని విహెచ్, బిర్ల, ఈరావత్‌లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో అసెంబ్లీలో చేసిన చట్టం అమలు చేయాలని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి తరఫున ఒత్తిడి తెస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తామని చెప్పారు. బిసి జెఎసి చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

తెలంగాణ ఉద్యమ తరహాలు బిసి ఉద్యమం

దశాబ్దాలుగా బిసిలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని బిఆర్‌ఎస్ నేతలు మధుసూధనా చారి, శ్రీనివాస్ గౌడ్‌లు అన్నారు. పార్టీలను పక్కనపెట్టి బిసిలకు సామాజిక న్యాయం కోసం తెలంగాణలో మరో పోరాటాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. బిసి రిజర్వేషన్ల సాధనలో బిసిలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదనే రీతిలో ఒక్కటే జట్టుగా గట్టిగా పోరాడాలన్నారు. బిఆర్‌ఎస్ బిసి జెఎసి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ తరాహాలోనే బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని సూచించారు

ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటాం: మందకృష్ణ 

బిసి ఉద్యమానికి ఎంఆర్‌పిఎస్ వెన్నంటి ఉంటుందని, బయట నుండి మద్దతు ఇవ్వకుండా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఉద్యమాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా ముందుకు తీసుకెళ్తే కచ్చితంగా విజయం సాధించడం ఖాయమన్నారు. నాటి దేశ స్వాతంత్ర పోరాటం నుండి నేటి వర్గీకరణ పోరాటం వరకు శాంతియుతంగా పోరాడితేనే విజయం సిద్ధించిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ బిజెపిలపై ఒత్తిడి పెంచడానికి శాంతియుత పోరాటమే లక్ష్యంగా బిసి ఉద్యమం ముందుకు సాగలని సూచించారు. బిసి జెఎసి రాజీ లేకుండా నిజాయితీగా కొట్లాడాలని, జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వాన్ని ఎమ్మార్పీఎస్ బలపరుస్తుందని ఆయన వెల్లడించారు.

బిసిలు ఒంటరి కాదు: అద్దంకి దయాకర్

రాష్ట్రంలో బిసిలు ఒంటరి కాదని, బిసి సమాజానికి సకల జనులు అండగా నిలబడతారని, ఇది రాష్ట్ర బంద్ తో తేటతలమైందని అద్దంకి దయాకర్ అన్నారు. బిసి ఉద్యమానికి మాల మాదిగ, ఆదివాసి, గిరిజన, మైనారిటీ సమాజం తోడుగా ఉంటుందని రాజకీయాలకు అతీతంగా బహుజనులు ఏకమై బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని బలపరుస్తామని ఆయన వెల్లడించారు.

ఐక్యంగా ముందుకు కదలాలి: ఆర్.నారాయణమూర్తి

తరతరాలుగా బిసిలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి అంబేద్కర్ ఫూలే చూపించిన మార్గంలో బిసిలు ఐక్యంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు దండుగట్టాలని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. పోరాడితే పోయేది ఏమీలేదని, చరిత్రలో పోరాడిన సమాజమే విజయ తీరాలకు చేరిందని బిసిలు కూడా తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చారు.

పల్లెలకు విస్తరించాలి: రిటైర్డ్ ఐఎఎస్ కొల్లేటి ప్రభాకర్

బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కొల్లేటి ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర బంద్ తర్వాత బిసి ఉద్యమం రాష్ట్రంలో బలపడిందని బిసిల బలాన్ని బలగాన్ని చూపించే తరుణ ఆసనమైందని ఆయన అన్నారు.

బిసి జెఎసి కార్యాచరణ

బిసి జెఎసి విస్తృత స్థాయి సమావేశం అష్టాంగ ఆందోళనలు పేరుతో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. నవంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా పూలే అంబేడ్కర్ విగ్రహాల ముందు బిసిల మౌన దీక్షలు, నవంబర్ 13న రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయసాధన కోసం పల్లె నుండి పట్నం వరకు ‘బిసిల ధర్మపోరాట దీక్షలు, నవంబర్ 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ఈ నెల 18న పార్లమెంటు సభ్యుల పై ఒత్తిడి పెంచడానికి ‘ఎంపీలతో బిసిల ములాఖత్‘, 23 న బిసి రిజర్వేషన్లపై అఖిలపక్ష పార్టీల సమావేశం, డిసెంబర్ మొదటి వారంలో బిసిల చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి, డిసెంబర్ మూడోవారం నుండి పల్లె నుండి పట్నం వరకు బిసిల బస్సు యాత్ర, జనవరి 4వ వారంలో లక్షలాది మందితో ‘వేలవృత్తులు- కోట్ల గొంతులు‘ అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ చేపట్టనున్నట్లు ప్రకటించారు.

​రాష్ట్రంలో రిజర్వేషన్‌ల ఉద్యమం మరింత ఉధృతంఅష్టాంగ ఆందోళన పేరుతో బిసి జెఎసి ఉద్యమ కార్యాచరణ
ఇక పల్లె పల్లెకు పోరాటం.. నవంబర్ లో పార్లమెంటు ముట్టడి
నేటి ఉద్యమం రేపటి సామాజిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది
జెండాలు వదిలి ఒకే ఎజెండాతో ముందుకు
బిసి జెఎసి విస్తృత స్థాయి సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, సంఘాలు
బిసి రిజర్వేషన్ల విషయంలో ఇక ప్రత్యక్ష సమరమే
బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు 42 శాతం సాధించేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని బిసి జెఎసి నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్, బంజారాహిల్స్ లోని కళింగ కల్చరర్ సెంటర్ లో బిసి జెఎసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 42 శాతం బిసి రిజర్వేషన్‌ల పెంపుకు భవిష్యత్ కార్యాచరణ పై చర్చించి అష్టాంగ ఆందోళన పేరుతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీల నేతలు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, మాజీ ఎంపి వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎంఎల్‌సి అద్దంకి దయాకర్, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, ప్రముఖ సినీ నటులు ఆర్. నారాయణమూర్తి, సినీ దర్శకులు ఎన్ శంకర్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలురీ గౌరీశంకర్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, బిసి జెఎసి కో చైర్మన్ దాసు సురేష్, కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ నాయకులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ, న్యాయవాద, డాక్టర్స్, మేధావుల సంఘాల నేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నుండి ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు వేలాదిమంది హాజరయ్యారు. ఈనెల 20 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేసి బిసి రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెల్పాల్సిందేనని, లేదంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు బిసిలు ప్రత్యక్ష పోరాటానికి పూనుకుంటారని సమావేశం హెచ్చరించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బిసి జెఎసి సమావేశానికి బిజెపి నేతగా రాలేదని, ఒక బిసి బిడ్డగా హాజరయ్యానని అన్నారు. బిసి రిజర్వేషన్ల సాధన కోసం బిసి జెఎసి పోరాటానికి తన వంతు మద్దతు ఉంటుందన్నారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదని రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక వర్గాలలో బిసిలకే అన్యాయం జరుగుతోందని అన్నారు. దగా పడ్డ బిసిలు దండుగట్టే సమయం ఆసన్నమైందన్నారు ఏ రాజకీయ పార్టీకి చెందని నిస్వార్థ, నిజాయితీతో బిసిల కోసం ఉద్యమించేవారు బిసి జెఎసి నాయకత్వం వహించాలని, గమ్యాన్ని ముద్దాడె వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు .
వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు: బిహెచ్, బీర్ల, ఈరావత్
బిసి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గే ప్రసక్తి లేదని విహెచ్, బిర్ల, ఈరావత్‌లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో అసెంబ్లీలో చేసిన చట్టం అమలు చేయాలని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి తరఫున ఒత్తిడి తెస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తామని చెప్పారు. బిసి జెఎసి చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
తెలంగాణ ఉద్యమ తరహాలు బిసి ఉద్యమం దశాబ్దాలుగా బిసిలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని బిఆర్‌ఎస్ నేతలు మధుసూధనా చారి, శ్రీనివాస్ గౌడ్‌లు అన్నారు. పార్టీలను పక్కనపెట్టి బిసిలకు సామాజిక న్యాయం కోసం తెలంగాణలో మరో పోరాటాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. బిసి రిజర్వేషన్ల సాధనలో బిసిలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదనే రీతిలో ఒక్కటే జట్టుగా గట్టిగా పోరాడాలన్నారు. బిఆర్‌ఎస్ బిసి జెఎసి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ తరాహాలోనే బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని సూచించారు
ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటాం: మందకృష్ణ  బిసి ఉద్యమానికి ఎంఆర్‌పిఎస్ వెన్నంటి ఉంటుందని, బయట నుండి మద్దతు ఇవ్వకుండా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఉద్యమాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా ముందుకు తీసుకెళ్తే కచ్చితంగా విజయం సాధించడం ఖాయమన్నారు. నాటి దేశ స్వాతంత్ర పోరాటం నుండి నేటి వర్గీకరణ పోరాటం వరకు శాంతియుతంగా పోరాడితేనే విజయం సిద్ధించిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ బిజెపిలపై ఒత్తిడి పెంచడానికి శాంతియుత పోరాటమే లక్ష్యంగా బిసి ఉద్యమం ముందుకు సాగలని సూచించారు. బిసి జెఎసి రాజీ లేకుండా నిజాయితీగా కొట్లాడాలని, జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వాన్ని ఎమ్మార్పీఎస్ బలపరుస్తుందని ఆయన వెల్లడించారు.
బిసిలు ఒంటరి కాదు: అద్దంకి దయాకర్
రాష్ట్రంలో బిసిలు ఒంటరి కాదని, బిసి సమాజానికి సకల జనులు అండగా నిలబడతారని, ఇది రాష్ట్ర బంద్ తో తేటతలమైందని అద్దంకి దయాకర్ అన్నారు. బిసి ఉద్యమానికి మాల మాదిగ, ఆదివాసి, గిరిజన, మైనారిటీ సమాజం తోడుగా ఉంటుందని రాజకీయాలకు అతీతంగా బహుజనులు ఏకమై బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని బలపరుస్తామని ఆయన వెల్లడించారు.
ఐక్యంగా ముందుకు కదలాలి: ఆర్.నారాయణమూర్తి
తరతరాలుగా బిసిలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి అంబేద్కర్ ఫూలే చూపించిన మార్గంలో బిసిలు ఐక్యంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు దండుగట్టాలని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. పోరాడితే పోయేది ఏమీలేదని, చరిత్రలో పోరాడిన సమాజమే విజయ తీరాలకు చేరిందని బిసిలు కూడా తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చారు.
పల్లెలకు విస్తరించాలి: రిటైర్డ్ ఐఎఎస్ కొల్లేటి ప్రభాకర్
బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కొల్లేటి ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర బంద్ తర్వాత బిసి ఉద్యమం రాష్ట్రంలో బలపడిందని బిసిల బలాన్ని బలగాన్ని చూపించే తరుణ ఆసనమైందని ఆయన అన్నారు.
బిసి జెఎసి కార్యాచరణ
బిసి జెఎసి విస్తృత స్థాయి సమావేశం అష్టాంగ ఆందోళనలు పేరుతో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. నవంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా పూలే అంబేడ్కర్ విగ్రహాల ముందు బిసిల మౌన దీక్షలు, నవంబర్ 13న రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయసాధన కోసం పల్లె నుండి పట్నం వరకు ‘బిసిల ధర్మపోరాట దీక్షలు, నవంబర్ 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ఈ నెల 18న పార్లమెంటు సభ్యుల పై ఒత్తిడి పెంచడానికి ‘ఎంపీలతో బిసిల ములాఖత్‘, 23 న బిసి రిజర్వేషన్లపై అఖిలపక్ష పార్టీల సమావేశం, డిసెంబర్ మొదటి వారంలో బిసిల చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి, డిసెంబర్ మూడోవారం నుండి పల్లె నుండి పట్నం వరకు బిసిల బస్సు యాత్ర, జనవరి 4వ వారంలో లక్షలాది మందితో ‘వేలవృత్తులు- కోట్ల గొంతులు‘ అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ చేపట్టనున్నట్లు ప్రకటించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *