యాప్ వినియోగిస్తే ప్రయోజనాలు ఎన్నో..
విశాలాంధ్ర -కొవ్వూరు: మున్సిపల్ పరిధిలోని పట్టణాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పురమిత్ర యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మున్సిపల్ శాఖ సంచాలకుడు, కమిషనర్ నేరుగా యాప్ను పర్యవేక్ష తుండడడంతో అధికారులు పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి సంబంధిత సమాచారాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను చెల్లింపు, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపు, నీటి చార్జీలు చెల్లింపు, నీటి సరఫరా కులాయిల కనెక్షన్ల దరఖాస్తులు, వ్యాపార లైసెన్స్ దరఖాస్తులు, ప్రకటన పన్ను చెల్లింపులు, వివాహ రిజిస్ట్రేషన్ వంటి సేవలు పొందవచ్చు. డౌన్లోడ్ ఇలా.. మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ లోకి వెళ్లి పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ సమయంలో ఓటిపి వస్తుంది దాన్ని ఎంటర్ చేసి వినియోగించుకోవచ్చు ఫిర్యాదుదారులు కార్యాలయాలకు వెళ్లకుండా ఈ యాప్ లోనే తెలియజేయవచ్చు. ఫిర్యాదులు ఇలా.. ప్రజారోగ్యం పారిశుధ్యం నీటి సరఫరా పట్టణ ప్రణాళిక యు సి డి పరిపాలన ఇంజనీరింగ్ వీధి దీపాలు భవన నిర్మాణ వ్యర్ధాలు డ్రైనేజీలలో పూడికలు బయోమెడికల్ వ్యర్ధాలు వీధి కుక్కలు పరిశుద్ధ కార్మికుల గైరహాజరు వంటి సమస్యలపై యాప్ లో ఫిర్యాదు చేయవచ్చు. సేవలు ఇలా.. ఆస్తి పన్ను చెల్లింపు ఖాళీ స్థలాలు పన్ను చెల్లింపు నీటి చార్జీలు చెల్లింపు నీటి సరఫరా కుళాయిల దరఖాస్తు వ్యాపార లైసెన్స్ దరఖాస్తు ప్రకటన పన్నుల చెల్లింపు వివాహ రిజిస్ట్రేషన్ వంటి సేవలు పొందవచ్చు. ఈ యాప్ విషయమై కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇప్పటివరకు 2500 కు పైగా సమస్యలపైన, సేవల పైన తమ కార్యాలయ పరిధిలోనిలోని ఆయా శాఖల అధికారుల లాగిన్ కు వచ్చాయని దాదాపు వాటన్నిటినీ ఫోటోలు తో సహా రిప్లై ఇవ్వడం జరిగిందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
The post ప్రజలు చెంతకే పుర సేవలు appeared first on Visalaandhra.
యాప్ వినియోగిస్తే ప్రయోజనాలు ఎన్నో.. విశాలాంధ్ర -కొవ్వూరు: మున్సిపల్ పరిధిలోని పట్టణాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పురమిత్ర యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మున్సిపల్ శాఖ సంచాలకుడు, కమిషనర్ నేరుగా యాప్ను పర్యవేక్ష తుండడడంతో అధికారులు పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి సంబంధిత సమాచారాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను చెల్లింపు, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపు, నీటి చార్జీలు చెల్లింపు, నీటి సరఫరా కులాయిల కనెక్షన్ల దరఖాస్తులు, వ్యాపార లైసెన్స్
The post ప్రజలు చెంతకే పుర సేవలు appeared first on Visalaandhra.
