Headlines

ఈ నెల 2 లోపు నివేదిక సమర్పించాలి

విజన్‌ డాక్యుమెంట్‌ పై అధికారులకు సీఎం ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రైజింగ్‌- 2047 పాలసీ డాక్యుమెంట్‌కు సంబంధించిన నివేదికను ఈ నెల 2వ తేదీ రాత్రి వరకు సమర్పించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో ఆయన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి ఆంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు.

3, 4 తేదీల్లో అన్ని శాఖలు సమర్పించిన నివేదికలను సీఎస్‌, స్పెషల్‌ సీఎస్‌, సీఎంవో అధికారులు పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులను చేసి తుది ప్రతి సిద్ధం చేయాలని కోరారు. 6వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 డాక్యుమెంట్‌ సంపూర్ణంగా సిద్ధం కావాలనీ, అందుకోసం అన్ని విభాగాల అధికారులు తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలని ఆయన ఆదేశించారు. గ్లోబల్‌ సదస్సు ఏర్పాట్లు నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించారు.

The post ఈ నెల 2 లోపు నివేదిక సమర్పించాలి appeared first on Navatelangana.

​విజన్‌ డాక్యుమెంట్‌ పై అధికారులకు సీఎం ఆదేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రైజింగ్‌- 2047 పాలసీ డాక్యుమెంట్‌కు సంబంధించిన నివేదికను ఈ నెల 2వ తేదీ రాత్రి వరకు సమర్పించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో ఆయన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి
The post ఈ నెల 2 లోపు నివేదిక సమర్పించాలి appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *