Headlines

గ్లోబల్‌ సమ్మిట్‌కు మోడీ, రాహుల్‌కు ఆహ్వానం

స్వయంగా ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
అన్ని రాష్ట్రాల సీఎంలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులకు కూడా…

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. ప్రధాని మోడీ, పార్లమెం టులో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగ్గట్టు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు.

ఇందుకోసం ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తారు. ఎవరిని ఆహ్వానించారు.. ఎవరు ఆహ్వానించారు.. వారి రాకను నిర్ధారించడం, వచ్చే వారికి తగిన వసతులు కల్పించడంతోపాటు వారికి లైజనింగ్‌ చేసేందుకు ఉన్నతాధికారుల నియామకం …ఇలా అన్నింటిని ఆహ్వాన కమిటీ నిర్దారించనుంది. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డ్యాష్‌బోర్డ్‌ ద్వారా సీఎం పర్యవేక్షించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని.. అందులో వెయ్యి మంది ఇప్పటికే తమ రాకను నిర్దారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు.

The post గ్లోబల్‌ సమ్మిట్‌కు మోడీ, రాహుల్‌కు ఆహ్వానం appeared first on Navatelangana.

​స్వయంగా ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్ని రాష్ట్రాల సీఎంలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులకు కూడా… నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. ప్రధాని మోడీ, పార్లమెం టులో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా కలిసి
The post గ్లోబల్‌ సమ్మిట్‌కు మోడీ, రాహుల్‌కు ఆహ్వానం appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *