Headlines

ఐబొమ్మ రవిని కాదు.. వారిని ఉరి తీయాలి.. సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్

ఐబొమ్మ వెబ్‌సైట్‌లో నేను కూడా సినిమాలు చూశా

వందల్లో టికెట్ ధరలవల్లే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి

ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది పుడతారు

సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ

మన తెలంగాణ / హైదరాబాద్ : ఐబొమ్మ’ వెబ్‌సైట్‌లో తాను కూడా సినిమాలు ఉచితంగా చూశానని సిపిఐ సీనయర్ నాయకుడు డా. కె. నారాయణ అన్నారు. ఐబొమ్మ రవిని శిక్షించడం కంటే అసలైన సినిమా మాఫియాను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ డా. నారాయణ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టికెట్ ధరలను రూ. 600 నుండి రూ.700 వరకు పెంచితే సామాన్యులు సినిమాలు ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కోట్లు ఖర్చుపెట్టి, టికెట్ ధరల కోసం అడుక్కుంటారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం సాయం చేస్తుందా? కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బకొట్టారు‘ అని నారాయణ వ్యాఖ్యానించారు. ఒకరిని జైల్లో వేయడం వల్ల ప్రయోజనం లేదని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని ఆయన సూచించారు. వ్యవస్థలోని లోపాలను సరిచేయనంత వరకు ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారని నారాయణ హెచ్చరించారు.

‘ఒక ఐబొమ్మ రవిని జైలులో వేస్తే మరో వంద మంది వస్తారన్నారు. అలాగే మావోయిస్టు నేత హిడ్మాను చంపడం ద్వారా వెయ్యి మంది హిడ్మాలు పుడతారని నారాయణ వ్యాఖ్యానించారు. వ్యవస్థాగత వైఫల్యాల వల్లే రవి లాంటి వారు తప్పుడు మార్గంలోకి వెళుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తులను శిక్షించడం సమస్యకు పరిష్కారం కాదని, అసలు సమస్య వ్యవస్థలోనే ఉందని నారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యవస్థే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులను సృష్టిస్తోందని, లోపాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి వారు వస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు.

​ఐబొమ్మ వెబ్‌సైట్‌లో నేను కూడా సినిమాలు చూశావందల్లో టికెట్ ధరలవల్లే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి
ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది పుడతారు
సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఐబొమ్మ’ వెబ్‌సైట్‌లో తాను కూడా సినిమాలు ఉచితంగా చూశానని సిపిఐ సీనయర్ నాయకుడు డా. కె. నారాయణ అన్నారు. ఐబొమ్మ రవిని శిక్షించడం కంటే అసలైన సినిమా మాఫియాను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ డా. నారాయణ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరలను రూ. 600 నుండి రూ.700 వరకు పెంచితే సామాన్యులు సినిమాలు ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కోట్లు ఖర్చుపెట్టి, టికెట్ ధరల కోసం అడుక్కుంటారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం సాయం చేస్తుందా? కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బకొట్టారు‘ అని నారాయణ వ్యాఖ్యానించారు. ఒకరిని జైల్లో వేయడం వల్ల ప్రయోజనం లేదని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని ఆయన సూచించారు. వ్యవస్థలోని లోపాలను సరిచేయనంత వరకు ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారని నారాయణ హెచ్చరించారు. ‘ఒక ఐబొమ్మ రవిని జైలులో వేస్తే మరో వంద మంది వస్తారన్నారు. అలాగే మావోయిస్టు నేత హిడ్మాను చంపడం ద్వారా వెయ్యి మంది హిడ్మాలు పుడతారని నారాయణ వ్యాఖ్యానించారు. వ్యవస్థాగత వైఫల్యాల వల్లే రవి లాంటి వారు తప్పుడు మార్గంలోకి వెళుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తులను శిక్షించడం సమస్యకు పరిష్కారం కాదని, అసలు సమస్య వ్యవస్థలోనే ఉందని నారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యవస్థే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులను సృష్టిస్తోందని, లోపాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి వారు వస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *