ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ విచారం వ్యక్తంచేశారు. ఎనభై ఏండ్ల ఖాలిదా జియా త్వరగా కోలుకోడానికి దేశ ప్రజలందరూ ప్రార్థనలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 23న ఆరోగ్యం విషమించడంతో ఖాలిదాను ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ ప్రజాస్వామ్యం పరివర్తన చెందుతున్న ఈ కీలక దశలో మాజీ ప్రధాని ఖాలిదా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అధ్యక్షుడు షహబుద్దీన్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారు అయిన మొహమ్మద్ యూనస్ తన నేతృత్వంలోని సలహా కమిటీని అత్యవసరంగా సమావేశపరిచి ఖాలిదా జియా కోలుకోవాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు లండన్‌లో తలదాచుకుంటున్న ఆమె కుమారుడు రెహమాన్.. బంగ్లాదేశ్‌కు తిరిగి రావడం తన చేతుల్లో లేని విషయమని ప్రకటించారు. ఆయన 2008 నుంచి లండన్‌లో ఉంటున్నారు.
The post మరింత విషమంగా ఖలీదా జియా ఆరోగ్యం appeared first on Navatelangana.
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ విచారం వ్యక్తంచేశారు. ఎనభై ఏండ్ల ఖాలిదా జియా త్వరగా కోలుకోడానికి దేశ ప్రజలందరూ ప్రార్థనలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 23న ఆరోగ్యం విషమించడంతో ఖాలిదాను ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ ప్రజాస్వామ్యం
The post మరింత విషమంగా ఖలీదా జియా ఆరోగ్యం appeared first on Navatelangana.
