– రోడ్లపై ఉన్న వరి ధాన్యాన్ని తొలగించాలి : ఎస్సై సుధాకర్
నవతెలంగాణ – టేకుమట్ల:
రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యాన్ని వెంటనే తొలగించాలని టేకుమట్ల ఎస్సై దాసరి సుధాకర్ రైతులను హెచ్చరించారు. ఆదివారం రాఘవపురం గిద్దె ముత్తారం మధ్యలో రోడ్డుపై పోసిన వరి ధాన్యంతో వాహనదారుడుకి తీవ్ర గాయాలు అయ్యాయని ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ టేకుమట్ల, వెలిశాల, గర్మిళ్లపల్లి, రాఘవపురం,రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబెట్టకూడదని తెలిపారు. రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబోస్తే చట్టరీత్యా నేరమని, రోడ్డుమీద పోస్తే ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా రైతులు ఆరబోస్తున్నారన్నారు. మీరు పండించిన వరి ధాన్యాన్ని మీ యొక్క సొంత స్థలాలలో లేదా మీ ఇంటికి ఆవరణ స్థలాలలో ఆరబెట్టుకోవాలని హెచ్చరించారు. రైతులెవరు ప్రధాన రహదారులపై వరి ధాన్యాన్ని ఆరబెట్టకూడదని తెలిపారు. రోడ్లపై పోసిన వరి ధాన్యంతో వాహనదారులకు ఇబ్బందితో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రైతులు గమనించాలని అన్నారు. ఇప్పటికే గ్రామాలలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇచ్చామని, అరబోసిన రైతులపై చట్టరీత్యా చర్యలు తప్పవని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
The post రోడ్లపై పోసిన వరి ధాన్యంతో వాహనదారుడికి గాయాలు. appeared first on Navatelangana.
– రోడ్లపై ఉన్న వరి ధాన్యాన్ని తొలగించాలి : ఎస్సై సుధాకర్నవతెలంగాణ – టేకుమట్ల:రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యాన్ని వెంటనే తొలగించాలని టేకుమట్ల ఎస్సై దాసరి సుధాకర్ రైతులను హెచ్చరించారు. ఆదివారం రాఘవపురం గిద్దె ముత్తారం మధ్యలో రోడ్డుపై పోసిన వరి ధాన్యంతో వాహనదారుడుకి తీవ్ర గాయాలు అయ్యాయని ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ టేకుమట్ల, వెలిశాల, గర్మిళ్లపల్లి, రాఘవపురం,రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబెట్టకూడదని తెలిపారు. రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబోస్తే చట్టరీత్యా నేరమని,
The post రోడ్లపై పోసిన వరి ధాన్యంతో వాహనదారుడికి గాయాలు. appeared first on Navatelangana.
