Headlines

Actress Hema: నాపై ఆ ట్రోలింగ్.. అమ్మను బలి తీసుకుంది..! తల్లి మరణం గురించి నటి హేమ ఎమోషనల్..

Actress Hema

Actress Hema: Actress Hema: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో నటి హేమ పాల్గొన్నారు. స్పెషల్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆమె స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి మరణంపై హేమ మాట్లాడారు. తనపై జరిగిన ట్రోలింగ్ వల్లే తన తల్లి మరణించారని ఆమె ఎమోషనల్ అయ్యారు.

”అమ్మని నేను, నా తమ్ముడు చాలా బాగా చూసుకుంటాం. నా మీద వచ్చిన ఒక న్యూస్ చూసి ఆమె తట్టుకోలేకపోయింది. నాకు నా జీవితంలో ఇంతవరకు ఒక చిన్న మచ్చ లేదు. ఇండస్ట్రీలో కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, మ్యారేజ్ లైఫ్ లో కానీ, ఫ్యామిలీ లైఫ్ లో కానీ.. అసలు ఎక్కడా నాపై రిమార్క్ లేదు. రాజకీయాల్లో కూడా నేను పోటీ చేశాను. అక్కడ కూడా నాకు మంచి పేరే వచ్చింది.

ఒక ఫేక్ న్యూస్ ని పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ప్రసారం చేశాయి. నిజం ఏంటో తెలుసుకోకుండా టెలికాస్ట్ చేశాయి. దాంతో నా తల్లి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడే వారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చాం. అక్కడి నుంచి అమ్మ బాగా చితికిపోయారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి.
16 నెలల వ్యవధిలో రెండు మూడు సర్జరీలు జరిగాయి. రోజూ డయాలసిస్ చేయాలి. ఫైనల్ గా స్ట్రోక్ రావడంతో చనిపోయారు. నా వల్ల మా అమ్మ బాధతో చనిపోయారు అనే ఫీలింగ్ నన్ను బాగా బాధిస్తోంది” అని నటి హేమ ఎమోషనల్ అయ్యారు.

Also Read: జనసేనలో జాయిన్ అవుతారా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో నటి హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..

​దాంతో నా తల్లి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి అమ్మ బాగా చితికిపోయారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *