Headlines

Dil Raju: ఎల్లమ్మ మూవీకి హీరో, హీరోయిన్ ఫిక్స్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. డిసెంబర్ లోనే అన్నీ..

Producer Dil Raju gives clarity on Yellamma movie hero and heroines

Dil Raju: ఎల్లమ్మ.. దర్శకుడు వేణు బలగం ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశాడో తెలియదు కానీ, అన్నీ ఆటంకాలే. ఒక్కోరోజు ఒక్కో హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం ఎల్లమ్మ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చిన వెంటనే ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్నాడు అంటూ ఫోటో కూడా విడుదల చేశారు మేకర్స్. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి హీరో నాని తప్పుకున్నాడు. ఆ తరువాత ఈ క్రేజీ ప్రాజెక్టులోకి యంగ్ హీరో శర్వానంద్ వచ్చాడు.. కొంతకాలానికి ఆయన కూడా తప్పుకున్నాడు.

Akhanda 2: ఇదేం ఫ్యానిజం రా బాబు.. ఒక టికెట్ లక్ష పెట్టి కొన్నాడు.. బాలయ్య క్రేజ్ మాములుగా లేదుగా..

నెక్స్ట్ నితిన్ ఫిక్స్ అన్నారు. త్వరలో షూటింగ్ కూడా మొదలవుతుంది అని స్వయంగా నితిన్ ప్రకటించాడు. కానీ, అనూహ్యంగా ఆయనను ఈ మూవీ నుంచి తప్పించారు మేకర్స్. ఫైనల్ ఎవరు ఈ సినిమాలో నటిస్తాన్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. హీరోయిన్స్ పై కూడా ఇలా చాలానే పేర్లు వినిపించాయి. కానీ, దిల్ రాజు(Dil Raju) నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా.. లేదా అని అనుకుంటున్న తరుణంలో తాజాగా ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు దిల్ రాజు. ఇటీవల ఆయన గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “ఎల్లమ్మ సినిమాలో హీరో ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే ఆ విషయంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. అలగే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది కూడా డిసెంబరులో ప్రకటిస్తాం. ఇక 2026 సంవత్సరానికి గానూ మా సంస్థ నుంచి ఆరు సినిమాలు వస్తాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా త్వరలోనే ప్రకటిస్తాం. ప్రస్తుతం మా బ్యానర్ నుంచి వస్తున్న రౌడీ జనార్ధన మూవీ షూటింగ్ జరుగుతోంది”అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు. దీంతో ఏళ్ళ సినిమా గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది అనే చెప్పాలి.

​ఎల్లమ్మ.. దర్శకుడు వేణు బలగం ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశాడో తెలియదు కానీ, అన్నీ(Dil Raju) ఆటంకాలే. ఒక్కోరోజు ఒక్కో హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *