Headlines

తెలుసుకోవడం ఎలా?

ప్రేమ… ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేమని చాలా మంది అంటుంటారు. కానీ ఇదే పేరుతో మూడో వ్యక్తిపై కలిగే వ్యామోహం చాలా జంటల మధ్య చిచ్చు పెడుతుంది. ఇలాంటి సమస్యలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఇవే సమస్యలతో ఎన్నో జంటలు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లకు వస్తున్నాయి. అలాగని ప్రతి చిన్న విషయానికీ భాగస్వామిపై అనుమానం పెంచుకోకుండా వారు చేసే కొన్ని పనులు, ప్రవర్తన ఆధారంగా వారి జీవితంలో మరొకరున్నారా? లేదా? అనేది గుర్తించవచ్చు. సమస్య ముదిరిపోకుండానే మీ బంధాన్ని నిలబెట్టుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం…

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలూ ఉండకూడదు. అప్పుడే వారి బంధం దృఢంగా పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తేనే అనుమానాలకు తావు లేకుండా ఇద్దరూ అన్యోన్యంగా ముందుకు సాగవచ్చు. అయితే ఉన్నట్లుండి తమ భాగస్వామి ప్రవర్తనలో మార్పులొచ్చినా, ప్రతి విషయంలోనూ రహస్యంగా ప్రవర్తించినా అనుమానించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు.

నివృత్తి చేసుకోండి
దాంపత్య బంధంలో చిరాకు, పరాకులకు ఓ సమయం, సందర్భం అంటూ ఉంటుంది. ఏదైనా విషయంలో ఇద్దరికీ పొంతన కుదరకపోతే ఒకరిపై ఒకరు చిరాకు పడడం… కాసేపయ్యాక తిరిగి ఇద్దరూ కలిసిపోవడం.. ఇది సహజంగా జరిగేదే! కానీ ఇలా కాకుండా మీరు కనిపిస్తే చిరాకు పడడం, ప్రతి చిన్న విషయానికీ మీపై కోపం తెచ్చుకోవడం, మీ భాగస్వామి ఇష్టపడే వారు కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ చిరాకును మీపై రుద్దడం, ఇలా ఏ విషయం గురించి అయినా మిమ్మలి ఓ దోషిగా చిత్రీకరించాలన్న ఉద్దేశంతో మీపై లేనిపోని నిందలేయడం, బాధపెట్టడం చేసినట్లయితే మీ భాగస్వామి మిమ్మల్ని త్వరగా వదిలించుకోవాలని చూస్తున్నారని అర్థం. అయితే ఇన్ని చేసినా పరిస్థితుల రీత్యా కొందరు సర్దుకుపోతూ ఇవన్నీ భరిస్తుంటారు. కానీ దీనివల్ల దాంపత్య బంధం సుఖంగా సాగదు. కాబట్టి భాగస్వామి విషయంలో అనుమానంగా అనిపిస్తే దాన్ని నివృత్తి చేసుకొని అడుగు ముందుకేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరో వ్యక్తి గురించి
భార్యా భర్తలంటే ఒకరికిలో ఒకరికి నచ్చిన అంశాల్ని పంచుకోవాలి. పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి. ఆఫీస్‌లో ఏదైనా విశేషముంటే దాని గురించి చర్చించుకోవాలి. ఇక ఏకాంతంగా ఉన్నప్పుడు రొమాంటిక్‌గా నాలుగు మాటలు మాట్లాడుకోవాలి. అంతేకానీ సందర్భం అయినా కాకపోయినా.. ప్రస్తావన వచ్చినా, రాయకపోయినా మీ భాగస్వామి మరో వ్యక్తి గురించి పదే పదే మాట్లాడుతున్నా వారిలోని మంచి విషయాలు చెబుతూ ఒక రకమైన భావోద్వేగానికి లోనవడం వంటివి చేస్తే ఆ వ్యక్తితో ఏదో సంబంధం ఉందన్న మీ అనుమానమే నిజం కావొచ్చు. ఇంకొంత మందిలో ఉన్నట్లుండి అందం, ఆహార్యం… వంటి విషయాల్లోనూ మార్పులు గమనించవచ్చు.

ఉన్నట్టుండి దూరం పెడితే
అప్పటి వరకు ప్రతి విషయంలో మీకు, మీ నిర్ణయాలకు ప్రాధాన్యమిచ్చిన వారు ఉన్నట్టుండి మిమ్మల్ని దూరం పెడితే ఎవరికైనా అనుమానం కలగడం సహజం. అయితే ఇందుకు గల కారణాలేంటో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో గోప్యత పాటించడం, ప్రతి విషయంలో మీ నిర్ణయం అడక్కపోవడం, కలిసి సమయం గడుపుదామని మీరు ఆసక్తి చూపినా అవతలి వారు ఏదో ఒక కారణం చూపి తప్పించుకోవడం, ఆఖరికి ఏకాంతంగా ఉండాల్సిన సమయంలోనూ మిమ్మల్ని దూరం పెట్టడం.. ఇవన్నీ మనసుకు బాధ కలిగించేవే. అంటే మీకంటే మరో వ్యక్తికి ప్రాధాన్యమిస్తున్నారనడానికి వీటిని ఓ సంకేతంగా భావించవచ్చు.

గొడవకు దిగొద్దు
భాగస్వామి వేరే రిలేషన్‌షిప్‌లో ఉన్నారనడాన్ని ఇలాంటి సంకేతాల ద్వారా గుర్తించడం వరకు బాగానే ఉన్నా.. ముందు మీ అనుమానం నిజమా? కాదా? అన్నది తేల్చుకోవడం ముఖ్యం. అలాకాకుండా నేరుగా భాగస్వామితో గొడవకు దిగితే అవతలి వారిది ఏ తప్పూ లేకపోతే మీదే పొరపాటవుతుంది. పైగా దీనివల్ల మీ మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీ భాగస్వామిపై మీకు అనుమానం ఉన్నప్పటికీ మనసును కుదుటపర్చుకొని ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, మూడో వ్యక్తి గురించి మీ మధ్య పదే పదే ఎందుకు ప్రస్తావన వస్తుందో సున్నితంగా అడగండి. ఇలా అవతలి వారి మనసులో ఉన్న విషయం బయటపడితే సరే సరి. లేదంటే ఇద్దరూ కలిసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు వెళితే ఫలితం ఉంటుంది.

The post తెలుసుకోవడం ఎలా? appeared first on Navatelangana.

​ప్రేమ… ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేమని చాలా మంది అంటుంటారు. కానీ ఇదే పేరుతో మూడో వ్యక్తిపై కలిగే వ్యామోహం చాలా జంటల మధ్య చిచ్చు పెడుతుంది. ఇలాంటి సమస్యలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఇవే సమస్యలతో ఎన్నో జంటలు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లకు వస్తున్నాయి. అలాగని ప్రతి చిన్న విషయానికీ భాగస్వామిపై అనుమానం పెంచుకోకుండా వారు చేసే కొన్ని పనులు, ప్రవర్తన ఆధారంగా వారి జీవితంలో మరొకరున్నారా? లేదా? అనేది
The post తెలుసుకోవడం ఎలా? appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *