పంజాగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్‌లోని కిచెన్‌లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రావడంతో రెస్టారెంట్‌లోని కస్టమర్లు, సిబ్బందిని బయటికి పంపించి మంటలను ఆర్పివేశారు.బిల్డింగ్ 5వ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ నుండి పొగలు రావడంతో స్థానికులు, బిల్డింగ్ లో ఉన్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.