హైదరాబాద్లో హారన్ మోతకు చెక్..
సిగ్నళ్ల వద్ద అనవసర హారన్లతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులుహైదరాబాద్ రోడ్లపై ప్రయాణమంటే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్షే. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎరుపు లైట్ పడగానే వెనుక నుంచి ఆగకుండా వినిపించే హారన్ల మోత నగరవాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఈ ధోరణి కేవలం చిరాకు కలిగించడమే కాకుండా, నగరాన్ని తీవ్రమైన శబ్ద కాలుష్యంలోకి నెట్టివేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ముంబై, బెంగళూరు నగరాల్లో విజయవంతమైన హాంక్ మోర్.. వెయిట్ మోర్ (ఎక్కువ హారన్ కొడితే…..
