Headlines

శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుంటేనే జీవితంలో ఉన్నతస్థాయికి ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి సృజనాత్మకతను వెలికితీసే రంగస్థలం బాలోత్సవంప్రతిరోజూ శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి : సీఐ ఉపేంద్రప్రముఖ లైబ్రరీలలో ఎస్వీకే లైబ్రరీ ఒకటి : ఎస్వీకే కార్యదర్శి పి.ప్రభాకర్‌ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, సేవా తత్వాలను పెంపొందించుకోవాలని ఎస్‌టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి పిలుపునిచ్చారు. అప్పుడే పిల్లలు ఉన్నతస్థాయికి ఎదుగుతారని చెబుతూ అబ్దుల్‌ కలాం, సుందరయ్య…

Read More

ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో మహిళా ఆపరేటర్లకు అవకాశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సింగరేణి యాజమాన్యం తొలిసారిగా మహిళలకు ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి అవకాశం కల్పించనుంది. వారికి అవకాశం కల్పించాలన్న సీఎండీ ఎన్‌.బలరామ్‌ ఆలోచన మేరకు సంస్థలో ప్రస్తుతం జనరల్‌ అసిస్టెంట్‌గా, బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న ఇటీవలనే దరఖాస్తులకు ప్రకటన చేశారు. దీంతో మొత్తం 43 మంది మహిళా కార్మికులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంటర్వ్యూలకు 35 మంది హాజరయ్యారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఎంపిక కమిటీ సభ్యులు జీఎం…

Read More

డాక్టర్‌ రమేశ్‌ రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఇంచార్జ్‌ వీసీగా నియమితులైన డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి శుక్రవారం సంగారెడ్డిలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డిని మంత్రి అభినందించారు. రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతను పెంచేందుకు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రమేశ్‌ రెడ్డికి ఈ సందర్భంగా మంత్రి సూచించారు. The post డాక్టర్‌ రమేశ్‌…

Read More

అసోం సీఎంను కలిసిన మంత్రి జూపల్లి

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు అసోం ముఖ్యమంత్రి హిమంతబిస్వా శర్మను కలిశారు. ‘తెలంగాణ రైజింగ్‌-2047’ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానపత్రం అందించారు. డిసెంబర్‌ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి గువహాటిలో అసోం సీఎంను కలిశారు. తెలంగాణ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని నిలిపేలా చేస్తున్న ఈ సమ్మిట్‌కు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా విజన్‌ డాక్యుమెంట్‌-2047ను…

Read More

యూరోవిజన్‌ పోటీని బహిష్కరిస్తున్నాం

– ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, స్లోవేనియా, స్పెయిన్‌ దేశాలు వెల్లడి– ఇజ్రాయిల్‌ పాల్గొనడంపై అభ్యంతరంవియన్నా : వచ్చే ఏడాది జరగబోయే యూరోవిజన్‌ పాటల పోటీని ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, స్లోవేనియా, స్పెయిన్‌ దేశాలు బహిష్కరించాయి. ఈ పోటీలో ఇజ్రాయిల్‌ను చేర్చటంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇజ్రాయిల్‌ను పోటీ నుంచి తొలగించాలని చేసిన అభ్యర్థనలను తిరస్కరించిన యూరోపియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ యూనియన్‌ (ఈబీయూ) నిర్ణయంతో అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు పాటల పోటీని బారుకాట్‌ చేస్తున్నట్టు ఆ నాలుగు దేశాలు ప్రకటించాయి….

Read More

లోక్‌సభలో కార్తీకదీపం రగడ…

బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్న డీఎంకే న్యూఢిల్లీ: తమిళనాడులోని మధురైలో ఉన్న తిరుపుండ్రం కొండపై కార్తీక దీపాన్ని వెలిగించకుండా అడ్డుకోవడంపై లోక్‌సభలో దుమారం చెలరేగింది. తిరుపుండ్రం కొండపై వెలిగించే కార్తీక దీపం అంశాన్ని లేవనెత్తుతూ డీఎంకే ఎంపీలు లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేశారు. ఇదే అంశాన్ని మళ్లీ జీరో అవర్‌లో లేవనెత్తారు. సుబ్రమణ్యస్వామి ఆలయ శిఖరంపై ప్రతి ఏడాది తరహాలో కార్తీక దీపాన్ని వెలగించేందుకు…

Read More

మరో బాలుడిపై వీధి కుక్క దాడి

నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ డివిజన్‌లో మరో బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. రంగారెడ్డి జిల్లా మన్సురాబాద్‌లో ఇటీవల మూగ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం విదితమే. ఇంతలోనే మరో ఘటన జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ డివిజన్‌ లక్ష్మీ నరసింహనగర్‌లో ఐదేండ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వీధి కుక్క బాలునిపై దాడి చేసింది. గమనించిన బాలుని తాత వెంటనే…

Read More

వడ్డీ రేట్లు మరో పావు శాతం తగ్గింపు : ఆర్బీఐ

ముంబయి : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మరోమారు వడ్డీ రేట్లకు కోత పెట్టింది. రెపోరేటును పావు శాతం తగ్గించి 5.25 శాతానికి పరిమితం చేసింది. ఆర్‌బిఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను ఆయన శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ కాలంలో మూడు సార్లు వడ్డీ రేట్లను 100 బేసిస్‌ పాయింట్లు తగ్గించామని గుర్తు చేశారు….

Read More

హవాలా రాకెట్ గుట్టురట్టు

మన తెలంగాణ/సికింద్రాబాద్: పోలీసుల కళ్లుగప్పి ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతున్న కేటగాళ్లను బోయిన్‌పల్లి పోలీసులు ఆరెస్టు చేసి వారి వద్ద నుండి 4.05 కోట్ల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి రష్మీ పెరుమాల్ వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్‌లో నాగోల్‌కు చెందిన విశ్వనాథచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లిలో చీటింగ్ కేసు నమోదు చేశారు. విశ్వనాథచారి ఆయన…

Read More

కారులో రూ.4 కోట్లు

హవాలా నగదు తరలిస్తుండగా పట్టివేత : నార్త్‌జోన్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాల్‌ వెల్లడి నవతెలంగాణ-బేగంపేటగుట్టు చప్పుడు కాకుండా ఓ కారులో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠాను నార్త్‌ జోన్‌ బోయిన్‌పల్లి పోలీసులు వెంబడించి పట్టుకున్నట్టు నార్త్‌ జోన్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాల్‌ తెలిపారు. నార్త్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె వివరాలు వెల్లడించారు. గతంలో బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఓ చీటింగ్‌(రూ.50 లక్షల) కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు కొనసాగుతోంది….

Read More