Headlines

విద్యుత్ ప్రమాద నివారణ చర్యలు..

నవతెలంగాణ – భిక్కనూర్పట్టణ కేంద్రంలోని కుమ్మరిగల్లి కాలనీలో ప్రమాద కరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ సంకీర్త్ మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్  ప్రమాదకరంగా ఉన్నందున ట్రాన్స్ ఫార్మర్ ను ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ ప్రమాదకర సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలన్నారు.  The post విద్యుత్ ప్రమాద నివారణ చర్యలు…..

Read More

దాయాదుల పోరుకు మళ్లీ ఆ రిఫరీనే..!

నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా రేపు (ఆదివారం) జరగనున్న భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఐసీసీ మళ్లీ ఆండీ పైక్రాఫ్ట్‌నే మ్యాచ్ రిఫరీగా నియమించింది. ఆయన నియామకంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఐసీసీ మాత్రం వెనక్కి తగ్గలేదు. పీసీబీ విన్నపాలను నిక్కచ్చిగా తిరస్కరిస్తూ, తమ నిర్ణయానికే కట్టుబడింది. గత ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ వివాదం మొదలైంది. ఆ మ్యాచ్‌లో…

Read More

పింఛన్ పెంచాలని వినతులు, నిరసనలు 

నవతెలంగాణ – రామారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పింఛన్ లను పెంచి, లబ్ధిదారులకు అందించాలని వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు ఉప్పల్ బాయి గ్రామపంచాయతీ కార్యాలయం ముందు వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు శనివారం నిరసన తెలిపారు. అనంతరం వారు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కొత్తొల యాదగిరి, మండల అధ్యక్షులు బాలాపురం సాయిలు, ఇనుగుర్తి రాజనర్సయ్య, సిహెచ్ సాయి, తదితరులు పాల్గొన్నారు….

Read More

Flipkart Big Billion Days Sale : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా ఆర్డర్ చేయండి.. ఆపిల్ ఐఫోన్ 17 కేవలం 10 నిమిషాల్లోనే హోం డెలివరీ..!

Flipkart Big Billion Days Sale : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కొనాలని అనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సందర్భంగా 10 నిమిషాల స్మార్ట్‌ఫోన్ డెలివరీని ప్రకటించింది. ఇందులో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ S24 వంటి పాపులర్ మోడళ్లు ఉన్నాయి. ఈ సర్వీసు ఎంపిక చేసిన నగరాల్లో భారీ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ డీల్‌లతో పాటు…

Read More

పలు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు 

నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని గిద్ద, మద్దికుంటతో పాటు జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో బతుకమ్మ వేడుకలను శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. The post పలు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు  appeared first on Navatelangana. ​నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని గిద్ద, మద్దికుంటతో పాటు జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో బతుకమ్మ వేడుకలను శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో…

Read More

సాయి శక్తి స్కూల్లో అమానుషం

ఇద్దరు విద్యార్థులను చావచితకబాదిన నిర్వాహకడు విద్యార్థుల వీపు, చేతులపై తీవ్రంగా స్టీలు స్కేల్ గుర్తులు, గాయాలువిచారించిన డీఈవో, పోలీసులు విద్యార్థులకు మద్దతుగా సిపిఐ, ప్రజా సంఘాలువిశాలాంధ్ర బ్యూరో_ అనకాపల్లి: మిడిమిడి అక్షర జ్ఞానంతో విద్యను వ్యాపార వస్తువుగా మార్చేసిన కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అంతే మిడిమిడి జ్ఞానం ఉన్న టీచింగ్ స్టాఫ్ తో విద్యా వ్వస్థను భ్రష్టు పట్టిస్తూ అధిక ఫీజులు వసూలే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుపోతున్నాయి. విద్యాశాఖ అధికారులు…

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – బిచ్కుంద బిచ్కుంద మున్సిపల్ పరిధిలో నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. అధ్యక్షులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదవారి ఇంటి కల నెరవేరిందని గత 30 సంవత్సరాలుగా పేదింటి కుటుంబాలకు ఇల్లు లేక ఎన్నో అవస్థలు పడ్డారని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసి దశలవారీగా లక్ష చొప్పున ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా…

Read More

పెద్దతూండ్ల హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు

నవతెలంగాణ – మల్హర్ రావుసద్దుల బతుకమ్మ వేడుకలు పురస్కరించుకుని శనివారం మండలంలోని పెద్దతూండ్ల హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయురాళ్లు,విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఉపాధ్యాయులు కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మానస, సుజాత, సిహెచ్ శర్మ ,యాకూబ్ పాషా ,ఐత మహేందర్, గోపి నాయక్, చంద్ర ప్రకాష్ ,ఒ.ఎస్ సందీప్, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు. The post పెద్దతూండ్ల హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ…

Read More

ఇక మొదలైందుల్లా.. సోషల్ మీడియాలో నిండిపోయింది.. షురూ చేయండి..

Bathukamma Celebrations 2025: ఇటీవల మొబైల్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా షార్ట్ వీడియోస్.. స్టేటస్, యూట్యూబ్, ఇంస్టాగ్రా.. ఇలా ఏ యాప్ చూసిన షార్ట్ వీడియోస్ కనిపిస్తున్నాయి. అయితే షార్ట్ వీడియోస్ లో ఒక విషయం పూర్తిగా చెప్పే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్, కౌన్సిలింగ్, హెల్త్ ఇలా ఎన్నో రకాలుగా వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఏదైనా ఫెస్టివల్ వచ్చే ముందు దానికి సంబంధించిన వీడియోస్ సందడి చేస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్…

Read More

రాంచీలో బయటపడిన ఉగ్రవాదుల శిబిరం

నవతెలంగాణ – హైదరాబాద్: ఝార్కండ్‌లోని రాంచీలో ISIS రిక్రూట్‌మెంట్ శిబిరం బయటపడింది. కొన్ని రోజుల క్రితం అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి విచారణలో ఉగ్ర శిబిరం గురించి తెలియడంతో రైడ్ చేశారు. పైకి హోటల్‌గా చెప్పకుంటున్న భవనంలోని అండర్‌ గ్రౌండ్‌లో ఓ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేయడాన్ని గుర్తించారు. పెద్ద ఎత్తున బాంబు తయారీ పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. The post రాంచీలో బయటపడిన ఉగ్రవాదుల శిబిరం appeared first…

Read More