జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జొన్నవలస ఒకేషనల్ విద్యార్థులకు జొన్నవలస గ్రామ సచివాలయం లో సచివాలయ వ్యవస్థ పైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు 10రోజుల ఇంటర్న్ షిప్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ వార్డు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి మరియు ఆన్లైన్ డేటా ఎంట్రీ, పెన్షన్ ప్రాసెసింగ్, ల్యాండ్ సర్వే, వ్యవసాయం పైన, పారిశుద్ధ్యం పైన, ఆరోగ్య వ్యవస్థ పైన ఇంటర్న్ షిప్ చేయడం జరిగింది. ఈ ఇంటర్న్ షిప్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల ఆవశ్యకతను విద్యార్థులు తెలుసుకొని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయులు టి విజయ లక్ష్మి అన్నారు. IT&ITeS ఉపాధ్యాయులు కంకణాల కిరణ్, బ్యాంకింగ్ ఉపాధ్యాయులు సూర్య పంచాయతీ కార్యదర్శి రవి, స్కూల్ టీచర్ శ్రీరామ నాయుడు, AB శ్రీధర్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒకేషనల్ విద్యార్థులకు 10 రోజుల ఇంటర్న్ షిప్
ఒకేషనల్ విద్యార్థులకు 10 రోజుల ఇంటర్న్ షిప్


