Headlines

హ్మ్…

లోతుల్లో దాగిన రహస్యాలు
ఇవ్వాళ కొత్త రంగులను పూసుకున్నాయి.
పెదవి దాటని మాటలు మౌనంగా
కంటికి తాకని బింబాలు
స్తబ్దతగా ఏవేవో కథలను చిత్రిస్తున్నాయి.
నిన్నటి సాయంత్రం ఒంటికాలి కాకి
స్మశానంలో దొరికే పిండం కోసం
ఏ దేవుడినైనా మొక్కుతుందా
బతుకంటే బరువు కాదని గూటి నుండి బయలుదేరే
తల్లిపిట్ట హితవు చెబుతూ
రేపటికి ఏ గింజను దాచలేదు మరి.
సాగిపోవడమే,
ఆగిపోవడంలో ఏ నిర్వచనం లేదు.

  • రామ్‌ పెరుమాండ్ల, 9542265831

The post హ్మ్… appeared first on Navatelangana.

​లోతుల్లో దాగిన రహస్యాలుఇవ్వాళ కొత్త రంగులను పూసుకున్నాయి.పెదవి దాటని మాటలు మౌనంగాకంటికి తాకని బింబాలుస్తబ్దతగా ఏవేవో కథలను చిత్రిస్తున్నాయి.నిన్నటి సాయంత్రం ఒంటికాలి కాకిస్మశానంలో దొరికే పిండం కోసంఏ దేవుడినైనా మొక్కుతుందాబతుకంటే బరువు కాదని గూటి నుండి బయలుదేరేతల్లిపిట్ట హితవు చెబుతూరేపటికి ఏ గింజను దాచలేదు మరి.సాగిపోవడమే,ఆగిపోవడంలో ఏ నిర్వచనం లేదు.
The post హ్మ్… appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *