Headlines

నిర్లక్షం వద్దు.. జూబ్లీహిల్స్ మనదే

 ఈ వారం రోజులు అవిశ్రాంతంగా పనిచేయండి

కంటోన్మెంట్ తరహాలో ఇక్కడ కూడా సెంటిమెంట్ పనిచేయదు

మంత్రులు, పార్టీ నేతలకు సిఎం రేవంత్ దిశానిర్దేశం

ఇంకొంచెం కష్టపడితే భారీ మెజార్టీ ఖాయం

భవిష్యత్తు ఎన్నికల్లోనూ సునాయాసంగా విజయాలు

మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి నివాసంలో కీలక భేటీ

ఉప ఎన్నికపై వ్యూహరచన 

హాజరైన పలువురు మంత్రులు, పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎట్టిపరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో మంత్రులు, ఇతర ముఖ్య నేతలు నిర్ణయించారు. ముఖ్యమంత్రి తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశానికి ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జి. వివేక్ వెంకట స్వామి, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి ‘లంచ్’ ఏర్పాటు చేశారు. భోజనానంతరం వారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై లోతుగా సమీక్షించారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి?, మైనారిటీ ఓటర్ల ప్రభావం ఎలా ఉంటుంది?, బిఆర్‌ఎస్ అభ్యర్థి సునీత పట్ల ప్రజల్లో సానుభూతి ఏమైనా ఉందా?, పార్టీ ప్రచారం ఎలా సాగుతున్నది తదితర అంశాలపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు.

ఇంటెలిజెన్స్ నివేదికలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని స్పష్టంగా ఉందన్నారు. ఇప్పుడు ద్వితీయ స్థానంలో నిలిచేందుకు బిఆర్‌ఎస్, బిజెపిలు కుస్తీ పడుతున్నాయన్నారు. మహిళా ఓటర్లు కాంగ్రెస్ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. మైనారిటీ ఓటర్లు సానుకూలంగా ఉన్నారని ఆయన చెబుతూ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని, నిర్లక్షంగా ఉండరాదని, ఈ వారం రోజులూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఇన్‌ఛార్జి మంత్రులందరమూ రోజం తా అక్కడే మకాం వేశామన్నారు. విపక్షాలు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారని ఆయన చెప్పారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోడ్-షో చేపట్టాక పరిస్థితి ఇంకా ఎక్కువ సానుకూలంగా మారిందన్నారు.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో గెలుపు మనదేనన్న నమ్మకంతో ఉన్నానని అన్నారు. జూబ్లీని హస్తగతం చేసుకోవడం ద్వారా రాష్ట్ర పార్టీ, ప్రభుత్వంపై అధిష్టానం నుంచి మంచి మార్కులు పొందవచ్చని అన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలోనూ పని చేయలేదని ఆయన వివరించారు. నాయకులు, కార్యకర్తలూ ఈ వారం రో జుల పాటు అవిశ్రాంతంగాని చేయాలని, అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌నుద్దేశించి అన్నారని తెలిసింది.

​ ఈ వారం రోజులు అవిశ్రాంతంగా పనిచేయండి
కంటోన్మెంట్ తరహాలో ఇక్కడ కూడా సెంటిమెంట్ పనిచేయదుమంత్రులు, పార్టీ నేతలకు సిఎం రేవంత్ దిశానిర్దేశంఇంకొంచెం కష్టపడితే భారీ మెజార్టీ ఖాయం
భవిష్యత్తు ఎన్నికల్లోనూ సునాయాసంగా విజయాలుమీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి నివాసంలో కీలక భేటీ
ఉప ఎన్నికపై వ్యూహరచన హాజరైన పలువురు మంత్రులు, పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్మన తెలంగాణ/హైదరాబాద్: ఎట్టిపరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో మంత్రులు, ఇతర ముఖ్య నేతలు నిర్ణయించారు. ముఖ్యమంత్రి తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశానికి ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జి. వివేక్ వెంకట స్వామి, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి ‘లంచ్’ ఏర్పాటు చేశారు. భోజనానంతరం వారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై లోతుగా సమీక్షించారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి?, మైనారిటీ ఓటర్ల ప్రభావం ఎలా ఉంటుంది?, బిఆర్‌ఎస్ అభ్యర్థి సునీత పట్ల ప్రజల్లో సానుభూతి ఏమైనా ఉందా?, పార్టీ ప్రచారం ఎలా సాగుతున్నది తదితర అంశాలపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని స్పష్టంగా ఉందన్నారు. ఇప్పుడు ద్వితీయ స్థానంలో నిలిచేందుకు బిఆర్‌ఎస్, బిజెపిలు కుస్తీ పడుతున్నాయన్నారు. మహిళా ఓటర్లు కాంగ్రెస్ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. మైనారిటీ ఓటర్లు సానుకూలంగా ఉన్నారని ఆయన చెబుతూ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని, నిర్లక్షంగా ఉండరాదని, ఈ వారం రోజులూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఇన్‌ఛార్జి మంత్రులందరమూ రోజం తా అక్కడే మకాం వేశామన్నారు. విపక్షాలు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారని ఆయన చెప్పారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోడ్-షో చేపట్టాక పరిస్థితి ఇంకా ఎక్కువ సానుకూలంగా మారిందన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో గెలుపు మనదేనన్న నమ్మకంతో ఉన్నానని అన్నారు. జూబ్లీని హస్తగతం చేసుకోవడం ద్వారా రాష్ట్ర పార్టీ, ప్రభుత్వంపై అధిష్టానం నుంచి మంచి మార్కులు పొందవచ్చని అన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలోనూ పని చేయలేదని ఆయన వివరించారు. నాయకులు, కార్యకర్తలూ ఈ వారం రో జుల పాటు అవిశ్రాంతంగాని చేయాలని, అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌నుద్దేశించి అన్నారని తెలిసింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *