దామరచర్లలో ఎమ్మెల్యే బీఎల్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ – దామరచర్లరైతు సంక్షేమం కోసం రూ.2 కోట్ల విరాళంగా ఇచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటానికి దామరచర్లలో కాంగ్రెస్ మండల నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తన కుమారుడి రిసెప్షన్ కోసం అయ్యే ఖర్చును రైతుల కోసం వినియోగించాలని ఆయన నిర్ణయించినట్లు చెప్పారు. తక్షణమే రూ.2 కోట్ల చెకు సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని సీఎంకు ఎమ్మెల్యే…
