Headlines

అనుమానానికి కుటుంబం బలి

 భార్య, కూతురు, వదినను హతమార్చి భర్త ఆత్మహత్య

 వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం

తప్పించుకున్న పెద్ద కూతురు 

మన తెలంగాణ/కుల్కచర్ల : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యతోపాటు, వదిన, కూతురిని హత్య చేసి, తాను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం…. కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన వేపూరి యాదయ్య, యాదయ్య 14 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరి సంతానం ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్య అక్రమ సంబంధం నెరుపుతోందన్న అనుమానంతో తరచు గొడవలు పడుతుండేవారు.

శనివారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. పెద్దమనుషులు నచ్చజెప్పి ఇంటికి పంపించడంతో నా పరువు పోయిందని ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఇంట్లో నిద్రిస్తున్న భార్య అలివేలు (32), కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), వదిన హనుమమ్మ (40)ల పై కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ దాడితో గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డ యాదయ్య పెద్ద కూతురు అపర్ణ స్పృహలోకి వచ్చి పక్కింటి వారికి జరిగిన ఉదంతాన్ని తెలిపింది. స్థానికులు వచ్చి చూసేసరికి భార్య, వదిన, చిన్న కూతురుతో పాటు యాదయ్య మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన అపర్ణను ఆస్పత్రికి తరలించారు.

​ భార్య, కూతురు, వదినను హతమార్చి భర్త ఆత్మహత్య వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణంతప్పించుకున్న పెద్ద కూతురు మన తెలంగాణ/కుల్కచర్ల : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యతోపాటు, వదిన, కూతురిని హత్య చేసి, తాను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం…. కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన వేపూరి యాదయ్య, యాదయ్య 14 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరి సంతానం ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్య అక్రమ సంబంధం నెరుపుతోందన్న అనుమానంతో తరచు గొడవలు పడుతుండేవారు. శనివారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. పెద్దమనుషులు నచ్చజెప్పి ఇంటికి పంపించడంతో నా పరువు పోయిందని ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఇంట్లో నిద్రిస్తున్న భార్య అలివేలు (32), కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), వదిన హనుమమ్మ (40)ల పై కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ దాడితో గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డ యాదయ్య పెద్ద కూతురు అపర్ణ స్పృహలోకి వచ్చి పక్కింటి వారికి జరిగిన ఉదంతాన్ని తెలిపింది. స్థానికులు వచ్చి చూసేసరికి భార్య, వదిన, చిన్న కూతురుతో పాటు యాదయ్య మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన అపర్ణను ఆస్పత్రికి తరలించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *