Headlines

మంధాన శతకం వృథా.. ఆస్ట్రేలియాపై పోరాడి ఓడిన భారత్

మూడో చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియాపై ఆస్ట్రేలియా మహిళా జట్టు ఘన విజయం సాధించింది. 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. 47 ఓవర్లలో టీమిండియా 369 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్ లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(125) విధ్వంసకర సెంచరీతో చెలరేగింది. మంధానతోపాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(52), దీప్తి శర్మ(72)లు అర్థ శతకాలతో రాణించినా పలితం లేకపోయింది. ఆసిస్ బౌలర్లలో గిమ్ గార్త్ 3 వికెట్లు,…

Read More

Off The Record: తెలంగాణ కేబినెట్‌లో సమన్వయం లోపించిందా..?

Off The Record: తెలంగాణ క్యాబినెట్‌ మంత్రుల మధ్య సమన్వలోపం కొట్టొట్టినట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల తరచూ జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనమని, దానివల్ల కొత్త రకం ఇబ్బందులు కూడా వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో మరో శాఖ మంత్రి సమీక్షలు నిర్వహించడం సెక్రటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో మంత్రుల సమీక్షలంటేనే హడలిపోతున్నారట ఉన్నతాధికారులు. ఇటీవల సచివాలయంలో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రులు. సమయాలు కూడా దాదాపు ఒకేలా ఉంటుండటంతో… ఏ…

Read More

స్టేషన్ ఘన్‌పూర్‌లో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు?: తాటికొండ రాజయ్య

రాజకీయ జన్మనిచ్చిన జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్‌లో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని ఎంఎల్‌ఎ కడియం శ్రీహరిని మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ తాటికొండ రాజయ్య సూటిగా ప్రశ్నించారు. శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అధికార మదంతో తనపైన, తన కార్యకర్తల పైన తప్పుడు ఆరోపణలు చేసే వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. నియోజకవర్గంపై ప్రేమ ఉంటే తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలోలా కడియం శ్రీహరి…

Read More

CM Revanth Reddy : గద్దెలు యథాతథంగా.. ఈ నెల 23న మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న సీఎం మేడారంకు వెళ్లి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. సమ్మక్క-సారలమ్మ పూజారులను సంప్రదించి, వారి సూచనలు, ఆమోదం తీసుకున్న తరువాతే అభివృద్ధి ప్రణాళికల డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించారు. Bonda Uma and Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై బోండా ఉమా వరుస ట్వీట్స్‌.. వివాదం ముగిసినట్టేనా..? సమీక్ష సందర్భంగా…

Read More

రెండో కాన్పులోనూ ఆడపిల్లే.. తల్లిదండ్రులతో కలిసి భార్యను గెంటేసిన భర్త

రెండవ కాన్పులో కూడా మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో ఆ మహిళకు కష్టాలు మొదలయ్యాయి. కొడుకు పుట్టలేదనే సాకుతో ఒకవైపు అత్తా మామ మరోవైపు భర్త ఈసడింపులు తోడు కావడంతో ఆ మహిళకు వారు పెట్టే ఇబ్బందులు గుదిబండలాగా మారాయి. దీంతో వారంతా కలిసి ఆమెను వద్దు అంటూ ఇంటి నుంచి గెంటేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన పేర్ల కుశలవ,…

Read More

Maruthi-Sai Durga Tej: మారుతి కథ.. సాయి దుర్గ తేజ హీరో.. మెగా ప్రాజెక్ట్ లాక్

Maruthi-Sai Durga Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్టు లాక్ అయ్యింది. మెగా సుప్రీం సాయి దుర్గ తేజ మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటిగ్ దశలో ఉంది. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్(Maruthi-Sai Durga…

Read More

అసెంబ్లీలో బోండా ఉమ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? పవన్‌ కల్యాణ్‌పై డైరెక్ట్‌ అటాక్‌..!

Bonda Uma: వైసీపీ ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదు. కూటమి పార్టీలే అపోజిషన్. కూటమి పార్టీలే అధికార పక్షం అన్నట్లు నడుస్తోంది ఏపీ అసెంబ్లీ. అందుకు తగ్గట్లుగానే తమ సభ్యులతో సమస్యలను ప్రస్తావించి..వాటికి మంత్రులతో సమాధానం చెప్పిస్తోంది కూటమి సర్కార్. అయితే ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నే కాస్త హాట్ టాపిక్ అయింది. ఆయన అనుకున్నదొకటి అయితే..అయింది ఇక్కోటి అన్నట్లుగా మారిపోయిందట. అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమా..ఆల్ ఆఫ్ సడెన్‌గా ఏపీ అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యే…

Read More

OG : రేపు ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ గెట్ రెడీ

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు సెప్టెంబర్ 21న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీనికి పవన్ కల్యాణ్‌ వస్తున్నాడు. టీమ్ మొత్తం రేపు ఫుల్ సందడి చేయబోతోంది. తాజాగా మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కల్యాణ్‌ ఫస్ట్ టైమ్ ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు. ఈ…

Read More

AUS Women vs IND Women: సూపర్ సెంచరీ చేసినా.. భారత్‌కు తప్పని ఓటమి..

AUS Women vs IND Women: ఆస్ట్రేలియా జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఉమెన్స్ టీమ్ పోరాడి ఓడింది. 413 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సూపర్ సెంచరీతో కదం తొక్కారు. స్మృతి 63 బంతుల్లోనే 125 పరుగులు చేశారు. 17 ఫోర్లు, 5 సిక్సులు బాదింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్…

Read More