ప్రభుత్వ విధానాల ఫలితమే వ్యవసాయ సంక్షోభం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు నవతెలంగాణ-వరంగల్‌మన దేశంలో మూడింట రెండొంతుల జనాభాకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నదని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. శుక్రవారం వరంగల్‌లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు. తరగతులకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన…
