Headlines

Manipur: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై మెరుపు దాడి.. ఇద్దరు సైనికులు మృతి..

Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్ సైనికులు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి 8 కి.మీ దూరంలో ఉనన నంబోల్ సబల్ లైకై ప్రాంతంలో, ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల వాహనంపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపినట్లు సైన్యం కూడా ధ్రువీకరించింది. Read Also: Sleep…

Read More

బిసిలను మోసం చేసిన కాంగ్రెస్: తీన్మార్ మల్లన్న

కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా బిసిలను మోసం చేసిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న విమర్శించారు. హన్మకొండలోని హరిత కాకతీయలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులో పక్కా మోసం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రతియేటా రూ.20 వేల కోట్ల పేరు చెప్పి తొలి బడ్జెట్‌లో రూ.9,200 కోట్లు పెట్ట్టి రూ.2,100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పది అంశాలతో…

Read More

196 కిలోల నకిలీ కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టు పట్టివేత

వికారాబాద్ జిల్లా, తాండూరులో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ విక్రయాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ విక్రయాల గుట్టు రట్టయింది. ఈ సందర్భంగా ఇద్దరు నిందితుల నుంచి పోలీసులు 196 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్‌పి నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు గురువారం జిల్లా ట్కాస్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్…

Read More

Vikarabad: వీడు మనిషి కాదు.. మానవమృగం.. కన్నతల్లినే కిరాతకంగా..

వీడు మనిషి కాదు.. మానవమృగం.. కన్నతల్లి నే కిరాతకంగా హతమార్చాడు.. బండరాయితో మోది తల్లిని చంపి పరారయ్యాడు. చంపింది కొడుకే అని తెలిసి.. గ్రామస్తులంతా షాక్‌ అయ్యారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఎందుకు చంపాడు..? హత్య చేసి.. ఆపై ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌ వేద్దామనుకున్నాడు..? ఇది వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్‌ గ్రామం. గ్రామానికి చెందిన 62 ఏళ్ల మల్లమ్మ రక్తపుమడుగులో పడి ఉంది. గమనించిన స్థానికులు వెళ్లి చూడగా… అప్పటికే మల్లమ్మ చనిపోయింది….

Read More

ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్

అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ఒమాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ (Team India) ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే షా ఫైజల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి శుభ్‌మాన్ గిల్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (15), సంజూ…

Read More

వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

వాగు దాటుతూ నీటిలో కొట్టుకపోతున్న వ్యక్తిని స్థానిక ప్రజలు, భువనగిరి రూరల్ పోలీసులు కాపాడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, అనాజిపురం-బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామాల మధ్యలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం, మాదారం గ్రామానికి చెందిన అలివర్తి పెద్ద మహేష్ అనాజిపురం నుంచి రావిపహాడ్ వెళ్లే దారిలో వాగు వద్ద వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు…

Read More

‘ఓజీ’ ట్రైలర్ లో ఊహించని పరిణామం.. ఏంటీ కొత్త పోకడ..?

OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక హై వోల్టేజ్ సినిమా అయితే ఇవ్వబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఈనెల 21వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు….

Read More

మహిళ కడుపు నుంచి 15 కిలోల కణితి తొలగింపు

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం, ఇస్నాపూర్ శివారులో గల మహేశ్వర మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ముంతాజ్ (55) గత మూడేళ్లుగా కడుపునొప్పితో పొట్ట పెరగటం వంటి సమస్యలతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు చాలా ఆసుపత్రులలో చూపించినప్పటికీ సరైన చికిత్స లభించక పోవటం, ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమెకుకు థైరాయిడ్, బిపి వంటి సమస్యలు కూడా…

Read More

CM Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్‌

టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు ముగ్గురు ఎమ్మెల్సీలు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్‌ టీడీపీలో చేరారు. మా రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదించలేదన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశాం. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదు. మండలి చైర్మన్‌ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని మర్రి రాజశేఖర్‌ తెలిపారు. Also Read:India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్‌తో రక్షణ ఒప్పందంపై…

Read More

Kerala Amoeba : కేరళలో మెదడును తినే మాయరోగం..!

కేరళలో ఓ వింత జబ్బు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా లేదంటే మెదడును తినే అమీబాగా పిలుస్తున్నారు. కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి ముక్కు ద్వారా మెదడులోకి వెళ్లి దాన్ని పూర్తిగా తినేస్తోంది. దీనివల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీని వ్యాప్తిని గుర్తించడం కష్టతరంగా మారింది. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి.. వ్యాధి సోకితే ఏం చేయాలి.. వ్యాధి బారిన పడకుండా…

Read More