వృత్తులన్నింటిలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది: ఎమ్మెల్యే
నవతెలంగాణ – తుంగతుర్తిసమాజంలో విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ నియోజకవర్గాన్ని విద్యా రంగంలో అగ్రభాగాన నిలపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేలు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున…
