PM Modi : నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. సామాన్య, మధ్య తరగతి వర్గాలపై వరాల వర్షం..?
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (ఆదివారం) జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5గంటలకు మోదీ మాట్లాడనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో కీలక మార్పులు చేసింది. స్లాబులను నాలుగు నుంచి రెండు స్లాబులకు కుదించింది. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి (22వ తేదీ) అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సామాన్య, మధ్య తరగతి వర్గాలపై మోదీ వరాల వర్షం కురిపిస్తారని తెలుస్తోంది. PM…
