Hyderabad Rain: హైదరాబాద్‌లో మరోసారి వాన బీభత్సం.. 2గంటలు దంచికొట్టిన వర్షం.. నదుల్లా రోడ్లు.. భారీగా ట్రాఫిక్ జామ్..
Hyderabad Rain: హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం వాన దంచికొట్టింది. 2 గంటలు నాన్ స్టాప్ గా కురిసింది. దీంతో రోడ్లు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గురువారం సాయంత్రం మొదలైన వాన.. ఒక్కసారిగా జోరందుకుంది….
