Headlines

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయకపోతే తరిమికొడతాం

కార్మికుల శ్రమను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే.. ఐక్యంగా ఉద్యమించాలి : సెమినార్‌లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య నవతెలంగాణ-రామచంద్రాపురంలేబర్‌కోడ్‌లను రద్దు చేయకపోతే కార్మిక ఐక్యతతో కేంద్ర ప్రభుత్వాన్ని తరిమికొడతామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య అన్నారు. మెదక్‌ జిల్లా రామచంద్రాపురంలోని భెల్‌ టౌన్‌షిప్‌లో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్‌ కోడ్‌లపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసేలా ఉన్న నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయకపోతే కేంద్ర…

Read More

తిరుపతి, నెల్లూరుకు ‘దిత్వా’ ముప్పు

నేడు అతి భారీ వర్షాలువిద్యాసంస్థలకు సెలవు అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ ఆదివారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీన పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం కారైకాల్‌కి 120 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 90 కిలోమీటర్లు, చెన్నైకు 150 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. ఈ మేరకు ఆ సంస్థ ఎమ్‌డి ప్రఖర్‌జైన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన 6 గంటల్లో 5…

Read More

బ్రిటన్‌లో భారత విద్యార్థి దారుణ హత్య

లండన్‌ : భారత విద్యార్థి ఒకరు బ్రిటన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. హర్యానాకు చెందిన 30 ఏళ్ల విజయ్ కుమార్‌ షెరాన్‌పై వోర్సెస్టర్‌ నగరంలోని బార్బోర్న్‌ రోడ్‌లో నవంబర్‌ 25 తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తరువాత రోజున విజయ్ కుమార్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరోవైపు…

Read More

మరింత విషమంగా ఖలీదా జియా ఆరోగ్యం

ఢాకా : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖాలిదా జియా ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ విచారం వ్యక్తంచేశారు. ఎనభై ఏండ్ల ఖాలిదా జియా త్వరగా కోలుకోడానికి దేశ ప్రజలందరూ ప్రార్థనలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 23న ఆరోగ్యం విషమించడంతో ఖాలిదాను ఒక ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఛాతీలో ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆమె గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ ప్రజాస్వామ్యం…

Read More

‘ఎయిర్‌-స్పేస్‌-ల్యాండ్‌-సీ-నెట్‌వర్క్‌’

15వ పంచవర్ష ప్రణాళిక కాలం ముగిసే నాటికి కొత్త వ్యవస్థ నిర్మాణానికి సన్నాహాలు హోల్‌గ్రాఫిక్‌ డిజిటల్‌ ఎర్త్‌ చైనీస్‌ వెర్షన్‌ అభివృద్ధికి చైనా కృషిఆ దేశ సహజ వనరుల మంత్రిత్వశాఖ వెల్లడి బీజింగ్‌ : 15వ పంచవర్ష ప్రణాళిక (2026-30) కాలం ముగిసే నాటికి కొత్త ”ఎయిర్‌-స్పేస్‌-ల్యాండ్‌-సీ-నెట్‌వర్క్‌” మౌలిక సదుపాయాల వ్యవస్థను నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. హోలోగ్రాఫిక్‌ డిజిటల్‌ ఎర్త్‌ యొక్క చైనీస్‌ వెర్షన్‌ను అభివృద్ధి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుందని ఆ దేశ సహజ వనరుల…

Read More

గ్లోబల్‌ సమ్మిట్‌కు మోడీ, రాహుల్‌కు ఆహ్వానం

స్వయంగా ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్ని రాష్ట్రాల సీఎంలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులకు కూడా… నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. ప్రధాని మోడీ, పార్లమెం టులో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా కలిసి…

Read More

ఈ నెల 2 లోపు నివేదిక సమర్పించాలి

విజన్‌ డాక్యుమెంట్‌ పై అధికారులకు సీఎం ఆదేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రైజింగ్‌- 2047 పాలసీ డాక్యుమెంట్‌కు సంబంధించిన నివేదికను ఈ నెల 2వ తేదీ రాత్రి వరకు సమర్పించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో ఆయన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి…

Read More

నేటి నుంచి జిల్లాల వారీగా సంబురాలు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లైన సందర్భంగా డిసెంబర్‌ 1 నుంచి జిల్లాల వారీగా సంబురాలు ప్రారంభమవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో జిల్లాల వారీగా జరిగే సంబురాలు వివరాలను వెల్లడించారు. సోమవారం నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రతి రోజు ఒక ఉమ్మడి జిల్లాలో జరుగుతాయని…

Read More

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

నలుగురు మృతి.. పలువురికి గాయాలుక్షతగాత్రుల్లో చిన్నారులూ వాషింగ్టన్‌ : గన్‌కల్చర్‌కు మారుపేరైన అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలో గల స్టాక్‌టన్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడినట్టు శాన్‌ జోక్విన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టు వివరించింది. క్షతగాత్రుల్లో చిన్నారులు…

Read More

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

అన్నాచెల్లెలు సహా నలుగురి సజీవదహనంఒక మహిళ సహా ఇద్దరికి గాయాలుఘటనపై కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం : పోలీసులు ఢిల్లీ : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని టిగ్రి ఎక్స్‌ టెన్షన్లోని చెప్పుల దుకాణంలో జరిగిన ఈ ఘటనలో అన్నా, చెల్లెలు సహా నలుగురు సజీవదహనమయ్యారు. ఒక మహిళ సహా ఇద్దరు గాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. వివరాళ్లోకెళ్తే… నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న చెప్పుల…

Read More